అప్పన్న స్వర్ణ తులసీ దళాలకు 2..లక్షల విరాళం

అప్పన్న స్వర్ణ తులసీ దళాలకు 2..లక్షల విరాళం
 వచ్చే ఏకాదశి నుంచి తొలిపూజ నిర్వహణకు సన్నాహాలు..
సింహాచలం..... 



సింహాచలం  : శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,,తాజాగా  దాతల సహకారంతో తయారుచేయిస్తున్న  108 స్వర్ణ తులసీదళాల పథకానికి సంబంధించి. మంచి స్పందన లభిస్తుంది..  ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,..వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు..  అప్పన్న చందనోత్సవం కమిటీ మాజీ సభ్యులు.. గంట్ల శ్రీనుబాబు కార్తీక  సోమవారాన్ని పురస్కరించుకుని నాలుగు స్వర్ణ తులసీ దళాలకు రెండు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు..... తన కుటుంబ సభ్యులతో కలిసి  ఆయన ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయ ఈవో పులి రాంబాబు కు అందజేశారు... ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు పాత్రికేయులు తో మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు... ఇప్పటి వరకు స్వామి అన్నదాన పథకానికి... స్వర్ణ సంపెంగ లకు... ఇప్పుడు స్వర్ణ తులసీ దళాలకు  తాను ఆయా మొత్తాలను తగు విరాళాల రూపంలో అందజేయడం జరిగిందని తెలిపారు... ప్రస్తుతం సమర్పించిన నాలుగు స్వర్ణ తులసిదళంల లో రెండు  తన మిత్రుడు బి వి కృష్ణారెడ్డి
కుటుంబ సభ్యుల పేరిట అందజేసినట్లు చెప్పారు ..... వచ్చే ఏకాదశి నుంచి నూతన స్వర్ణ తులసీదళాలతో  తొలిపూజ  నిర్వహించడం జరుగుతుంది అని ఏఈ ఓ పులి రాంబాబు దాత శ్రీనుబాబు  కుటుంబ సభ్యులకు వివరించారు.. ఈ కార్యక్రమంలో సింహాచలం ఆలయ ఉప ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు,. పెద్దరాజు ఇతర అర్చక వర్గాలు.. సిబ్బంది పాల్గొన్నారు