ఇసుక వారోత్సవాలు అంటే పొరపాటు పడ్డా..: లోకేష్

ఇసుక వారోత్సవాలు అంటే పొరపాటు పడ్డా..: లోకేష్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా 'ఇసుక వారోత్సవాలు'పై లోకేష్ వరుస ట్వీట్స్ చేశారు.
ఇసుక వారోత్సవాలు అంటే పొరపాటు పడ్డా : "ఇసుక వారోత్సవాలు అని వైఎస్ జగన్‌ గారు అంటే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డాను. జగన్ గారు అన్నది ఇసుక 'వార్' ఉత్సవాలు అని తరువాత అర్థం అయ్యింది. ఇసుక వార్‌లో భాగంగా ఇసుక వాటాల కోసం వైకాపా నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగలు కొట్టుకుంటున్నారు. ఒక పక్క వైకాపా నాయకులు ఇసుకలో వాటాల కోసం వీధిరౌడీల్లా కొట్టుకుంటుంటే గుంటూరు జిల్లా, పెదకాకానిలో జగన్ గారి చేతగాని పాలనకి మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైకాపా ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయితీలు ఆపి కార్మికులకు బతుకు భరోసా ఇవ్వండి జగన్ గారు" అని లోకేష్ హితవు పలికారు. ఈ ట్వీట్‌కు ఇసుక కోసం కొట్టుకుంటున్న వీడియోను సైతం లోకేష్ జత చేశారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు