అయ్యప్ప ఆలయంలో డాక్టర్ దంపతులచే అన్నదానం

*అయ్యప్ప ఆలయంలో డాక్టర్ దంపతులచే అన్నదానం*


వింజమూరు: వింజమూరులోని ప్రసన్నరెడ్డి నగర్ నందు ఫోస్టాఫీసు వీధిలో శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు రోజువారి కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప మాల ధారణ భక్తులకు పశు సం రక్షణ వైధ్యాధికారి డాక్టర్. కొమ్మి. కోటేశ్వరరావు- రజనీ దంపతులు అన్నదాన ఉభయ కర్తలుగా వ్యవహరించారు. తండ్రి శివరామయ్య, తల్లి శ్రీదేవిల ఆశీస్సులతో అన్నదానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా కోటేశ్వరరావు పేర్కొన్నారు. తొలుతగా ఆలయంలో మాల ధారణ భక్తులకు అయ్యప్ప శరణు ఘొషనలు, శతనామావళి తదితర విశేష పూజలను గురుస్వామి చేబ్రోలు. వసంతరావు నిర్వహించారు. అనంతరం అన్నదానమునకు శ్రీకారం చుట్టి ఉభయ దాతల పేర్లును ఉచ్చరిస్తూ వారికి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు, చాకలికొండ హైస్కూలు వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి. క్రిష్ణ, గురుస్వామి, మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఏ1 మొబైల్స్ ప్రొప్రయిటర్ చిట్టమూరి. హరీష్ తదితరులు పర్యవేక్షించారు....