తండ్రి అడుగు జాడల్లో రాణిస్తున్న తనయుడు జగన్ ; మేకపాటి

తండ్రి అడుగు జాడల్లో రాణిస్తున్న తనయుడు జగన్:


యం.యల్.ఏ మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి


వింజమూరు: ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మనసును చూరగొంటున్నారని ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వింజమూరులోని తహసిల్ధారు కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన రైతు భరోసా ప్రత్యేక సదస్సుకు విచ్చేసిన మేకపాటి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి ప్రజల సం క్షేమంతో పాటు రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నడుచుకుంటూ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు పరుస్తున్నారని కొనియాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణిని అవలంభించిందని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలు, ప్రజా సాధికారిత సర్వేల ద్వారా పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఈ రైతు భరోసా సదస్సుకు విశేష స్పందన లభించింది. మండలంలోని అధిక శాతం మంది రైతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఈ కార్యక్రమంలో తహసిల్ధారు ఎన్.హరినాధ్, డిప్యూటీ తహసిల్ధారు మురళీధర్ రాజు, యం.పి.డి.ఓ స్వరూపారాణి, ఇ.ఓ.పి.ఆర్.డి ఉషారాణి, మండల విధ్యాశాఖాధికారి మాలకొండలరావు, ఎన్.ఆర్.ఇ.జి.యస్ ఏ.పి.ఓ సుభాషిణి, వై.సి.పి రాష్ట బి.సి. సెల్ కో అర్డినేటర్ కర్నాటి. ప్రభాకర్ రెడ్డి, వై.సి.పి మండల కన్వీనర్ పల్లాల.కొండారెడ్డి, మాజీ వై.సి.పి మండల కన్వీనర్ గువ్వల. క్రిష్ణారెడ్డి, వింజమూరు ఉప సర్పంచ్ మద్దూరి.లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, గోపిరెడ్డి.రమణారెడ్డి, అన్నపురెడ్డి. శ్రీనివాసులురెడ్డి, దాట్ల.క్రిష్ణారెడ్డి, దాట్ల. వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.