నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్ననీలం సాహ్ని

నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్ననీలం సాహ్ని
అమరావతి,13నవంబరు:నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రధానం కార్యదర్శి నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు సంఖ్య జిఓఆర్టి నం.2563 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం,ఎంపవర్మెంట్ కార్యదర్శిగా పనిచేసిన ఆమె నవ్యాంధ్ర ప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.1984వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలక్టర్ గా పనిచేశారు.అలాగే టెక్కలి సబ్ కలక్టర్ గాను,నల్గొండ జిల్లా సంయుక్త కలక్టర్ గాను పని చేశారు.అదే విధంగా మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీగా,హైదరాబాదులో స్త్రీశిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు.అలాగే నిజామాబాదు జిల్లా పిడిడిఆర్డిఏ గాను,ఖమ్మం జిల్లాల్లో కాడా(CADA)అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు.తదుపరి ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా,నల్గొండ జిల్లా కలక్టర్ గాను,కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ గా,టిఆర్అండ్ బి కార్యదర్శిగా పనిచేశారు.అదే విధంగా క్రీడల శాఖ కమీషనర్ మరియు సాప్ విసి అండ్ ఎండిగాను పని చేశారు.అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు.అనంతరం స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంవపర్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సతీనాయర్, మిన్నీ మాధ్యూలు మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేయగా నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టనున్నారు.
     (ప్రచార విభాగం,సమాచారశాఖ,అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు