సంస్కృతి, వారసత్వం కలిగిన రాష్ట్రానికి నేను గవర్నర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను

2019 నవంబర్ 1 సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ నగర పాలక క్రీడా ప్రాంగణం ఆవరణలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా దీనిని నిర్వహించింది. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ ....


సభికులు అందరికీ నమస్కారం


. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, బెజవాడ శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆసీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప చారిత్రక సంస్కృతి, వారసత్వం కలిగిన రాష్ట్రానికి నేను గవర్నర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఈ రాష్ట్రం ఎందరో నిబద్ధత కలిగిన నాయకులను దేశానికి అందించింది.  'ఆంధ్రులు ఒక అద్భుతమైన గతాన్ని కలిగి ఉన్నారు.  చారిత్రాత్మకంగా ఐతరేయ బ్రాహ్మణంలో 'ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది.  శాతవాహనులతో ప్రారంభించి, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులతో సహా వివిధ ఆంధ్ర రాజ వంశాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించాయి.


ఆంధ్రుల చరిత్రలో క్రీస్తు శకం 624 నుండి 1323 మధ్య ఏడు శతాబ్దాలు ఎంతో ముఖ్యమైనవి.  ఈ కాలంలో తెలుగు భాష ప్రాకృత, సంస్కృత ఆధిపత్యం నుండి బయట పడి స్వదేశీ సాహిత్య మాధ్యమంగా ఉద్భవించింది. తత్ఫలితంగా, ఆంధ్ర దేశం ప్రత్యేక గుర్తింపును సాధించటమేకాక, భారతీయతలో తనదైన ప్రత్యేకతను అపాదించుకుంది. కాకాటియస్, బహమణి, విజయనగర్, కుతుబ్ షాహి, మొఘల్ రాజుల పాలన ద్వారా ఆంధ్ర ప్రాంతం యొక్క మధ్యయుగ చరిత్ర వెలుగు చూసింది. కాలానుగతంగా ఆసాఫ్ జాహిస్, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ పాలన ఇక్కడి ప్రజలకు సంక్రమించగా, తదుపరి స్వాతంత్ర్య పోరాటం వచ్చింది. అహింసా, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన అలంబనగా దేశవిముక్తి ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను తరమి కొట్టాలన్న మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుకు ఆంధ్రా ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు.


            నిజానికి 1921 జనవరిలో జరిగిన చీరాల -పెరాలా సంఘటన ఆంధ్ర ప్రాంత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో చెప్పుకోదగ్గ సంఘటనగా నిలిచింది. నాటి పాలకులకు పురపాలక పన్ను చెల్లించడానికి నిరాకరించినందుకు ఒక వృద్ధ మహిళతో పాటు పలువురికి బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. ఆ వృద్ధ మహిళే రాజకీయ కారణాలతో జైలు శిక్ష అనుభవించిన మొదటి మహిళగా గుర్తించబడటం విశేషం.


                                 అప్పట్లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు గాంధీజీ రాగా, ఈ సంఘటనే ఆయన స్వయంగా చీరాలను సందర్శించడానికి ప్రేరేపించింది. 1922లో అంగ్లేయిలపై అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఏజెన్సీ ప్రాంతాలలో జరిగిన సాయుధ తిరుగుబాటు ఆంధ్రా స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో మరో గొప్ప సంఘటన. గాంధీజీ విజయవాడను ఆరుసార్లు సందర్శించగా, 1920 లో జరిగిన విజయవాడ సమావేశంలో మహాత్మా గాంధీజీతో పాటు కస్తూర్బా గాంధీ,  సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి అనేక మంది ముఖ్య నాయకులు పాల్గొనగా, నాటి ప్రసంగాలు, వారి పోరాట పటిమ ఆంధ్ర ప్రాంత నాయకులపై గొప్ప ప్రభావాన్ని చూపి, వారిని స్వాతంత్ర్య పోరాటం దిశగా ప్రేరెపించాయి.


            స్వాతంత్ర్యం తరువాత మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం చేర్చగా, గాంధేయ మార్గంలో రాష్ట్ర విభజన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పొట్టి శ్రీరాములు అమరుడు కాగా, ఆ తరువతే మద్రాస్ నుండి విభజించబడింది. పొట్టి శ్రీరాములు అత్యున్నత త్యాగం మరువ లేనిది. 1952 అక్టోబర్ 19 న నిరాహార దీక్ష ప్రారంభించిన అమర జీవి డిసెంబరు 15న మృతి చెందటం నాడు ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఫలితంగానే 1953 అక్టోబరు 1న మద్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్రం విడివడింది.


            ఆంధ్ర ప్రాంతాన్ని వివిధ రాజవంశాలు, సామ్రాజ్యాలు పరిపాలించగా, అయా  సంస్కృతులు,  సంప్రదాయాలు ఈ వైవిధ్యమైన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని రూపొందించడంలో చెరగని ప్రభావాన్ని చూపాయి. ఏది ఏమైనప్పటికీ 1956 నవంబర్ 1న ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయిక్త రాష్ట్రంగా అవతరించడానికి ముందే ఈ రాష్ట్రం చాలా పరిణామాలను చూసింది.


            ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తంలో లోతైన అవగాహన ఉంది. ప్రజా సంక్షేమం,  సంపూర్ణ నిబద్ధత, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానం, వికేంద్రీకృత పరిపాలనతో నూతన రాష్ట్రాన్ని అద్బుతంగా నిర్మించగలరనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతున్న  ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగటం ముదావహం.


 


జై హింద్


 


Hon'ble Governor participates as Chief Guest at the AP Formation Day celebrations on 1st November 2019 at 6 PM at igms, Vijayawada, organized by the AP State Creativity & Culture Commission, Department of Language & Culture, Government of Andhra Pradesh



Dignitaries on the dais, SODARA, SADAREE MANULU ANDARIKI NAMASKARAM.
SRI VENKATESWARA SWAMY, SRI KANAKA DURGA AMMA VARI ASEESSULU MEEKU YELLAPPUDU UNDALANI KORU KUNTUNNANU.



I feel  proud to be the Governor of this historic State of Andhra Pradesh, a State with great historical culture and legacy and which has given birth to a great many leaders with visionary approach and commitment for the country and the people.


'Andhras' have a glorious past and historically the earliest mention of the 'Andhras' appeared in the Aitareya Brahmana in B.C. 800. Beginning with Satavahanas, who ruled for over 400 years from second century BC to second centuy AD, various Andhra dynasties, including Ikhsvaku, Pallavas and Chalukyas played a prominent role in the history of Andhra.


The seven centuries between AD 624 and AD 1323 were significant in the history of Andhra Desa as during this period the indigenous Telugu language emerged as a literary medium overthrowing the dominance of Prakrit and Sanskrit. As a result, Andhra desa achieved an identity and a distinction of its own as an important constituent of Indian Cultural set-up.


The medieval history of Andhra was marked by the rule of Kakatiyas, Bahamani, Vijayanagar, Qutb Shahi and Mughal kings. Followed by Asaf Jahis, the East India Company and the British rule and then came the Freedom struggle.


In Andhra, people responded spontaneously  to the call given by Mahatma Gandhi, for liberation of the country from the clutches of British rule through a non-violent, non-cooperation movement and civil disobedience.  


The Chirala-Perala incident that took place in January 1921, stands out as a remarkable incident in the history of freedom struggle in Andhra, wherein a old woman along with others was jailed by the British govt for refusing to pay municipal taxes. This old woman was considered to be the first woman in the country to be imprisoned on political grounds.


This prompted Mahatma Gandhiji, to visit Chirala after the All-India Congress session at Vijayawada. Another remarkable incident in the history of freedom movement in Andhra was that of the armed rebellion that broke out in the agency areas of the Northern Circars under the leadership of Alluri Sitaramaraju in 1922.


Gandhiji visited Vijayawada six times, each time with a vision, mission and message. The Vijayawada meeting in 1920, attended by Mahatma Gandhiji along with Kasturba and several important leaders of those days like Sardar Vallabhbhai Patel, Jawaharlal Nehru and Moulana Abdul Kalam Azad made a great impact on the leaders of Andhra region and motivated them in their relentless fight for freedom.


Andhra region, which was included in the Madras State after Independence, was bifurcated from Madras State after the supreme sacrifice made by Potti Sriramulu, a self-effacing Gandhian, who undertook a fast-unto-death on 19th October, 1952 and attained martyrdom on 15th December 1952.  


Andhra region was governed by different dynasties and empires. This diverse exposure to the cultures and traditions of the empires has had an indelible influence in shaping the culture of Andhra Pradesh.
However, the State had witnessed many changes before it emerged as the first linguistic State to be formed on November 1, 1956.


It is apt to recall here the words of Dr. Sarvepalli Radhakrishna, who said “We, the Andhras, are fortunately situated in some respects. I firmly believe that if any part of India is capable of developing an effective sense of unity it is in Andhra. The hold of conservatism is not strong. Our generosity of spirit and openness of mind are well -known. Our social instinct and suggestibility are still active. Our moral sense and sympathetic imagination are not much warped by dogma. Our women are relatively more free. Love of the mother-tongue binds us all.”


Awareness is deep in the blood of the people of Andhra Pradesh and I have no doubt that building a new State with total transparency, technology-driven, decentralised administration with welfare as the key commitment, the Government  will move forward on the path of development, while fulfilling the aspirations of the people of the state.


Jai Hind