తహసీల్దార్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
తొట్టంబేడు, నవంబర్ 5,అంతిమ తీర్పు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల తాసిల్దార్ గా విధులు నిర్వ హిస్తున్న విజయరెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తొట్టంబేడు తహసీల్దార్ పరమేశ్వర స్వామి డిమాండ్ చేశారు . మంగళవారం కార్యాలయంలో యువ తాసిల్దార్ విజయ రెడ్డి మృతికి నివాళులర్పించి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం వహించారు. అనంతరం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా తహసీల్దార్ పరమేశ్వర స్వామి మాట్లాడుతూ రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు నిరసన చేపట్టామని పేర్కొన్నారు . ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారులు పైనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు . కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశ్వర స్వామి తో పాటు డిప్యూటీ తహసీల్దార్ శాంతి,
ఆర్ఐ రవీంద్రబాబు, సర్వేయర్ రవిశేఖర్, వీఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తహసీల్దార్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి