*19–11–2019*
*అమరావతి*
అమరావతి: బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష
రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయం
స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించనున్న ప్రభుత్వం
బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలన్న సీఎం
ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని, విడతల వారీగా తగ్గిద్దామన్న అధికారులు
సుదీర్ఘ చర్చ తర్వాత బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయం
బార్లలో మద్యం సరఫరా వేళల కుదింపు
బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ, రాత్రి 11 వరకూ ఆహారం
స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం
బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం
*మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు*
నాన్‌బెయిల్ బుల్ కేసులు నమోదుతోపాటు కఠిన చర్యలు
లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని సమావేశంలో నిర్ణయం
*మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలన్న సీఎం*