కోటి అరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు

కోటి అరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు


దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు


విజయవాడ
25 - 11 - 2019


పశ్చిమ నియోజకవర్గంలో కోటి అరవై లక్షల రూపాయలతో రెండు మీటర్ల రోడ్లు  ఎనిమిది అడ్డ రోడ్డు నిర్మాణం మరియు కొండ ప్రాంతంలో డ్రైనేజ్ పనులు త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని  దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు..


సోమవారం 33 వ డివిజన్ సితార సెంటర్ నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వరకు మంత్రి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు..


ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు..


కొండ ప్రాంతంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని, రోడ్లు గుంతల మయం  కావడంతో ప్రజలు వారి ఇబ్బందులను మంత్రికి వివరించారు....


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిడిపి పాలనలో ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్లకు ప్రచారం పై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు...


ప్రజల కోరిక మేరకు కొండ ప్రాంతంలో డ్రైనేజీ మరియు అంతర్గత రహదారులు, రహదారుల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు..


అనంతరం సీనియర్ నాయకులు వీరంకి సత్యనారాయణ వారి స్వగృహం వద్ద వారిని మంత్రి పరామర్శించారు 


పర్యటనలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు  దుర్గారావు, డివిజన్ అధ్యక్షులు ఎద్దు సురేష్, బషీర్ అహ్మద్, కరిముల్లా, లీలా రాజారావు, సంభాని బాబురావు, పలాని దుర్గారావు, దాసరి శేఖర్ టైలర్ బాబు, ఏలూరు వెంకన్న తదితరులు పాల్గొన్నారు,