హెచ్‌ఓడి తరలించడం ఆషామాషీ కాదు : కన్నా
విజయవాడ : రాజధాని తరలింపు అంశం స్టేట్ హోల్డర్స్, కానీ ప్రభుత్వం కానీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన రాజధాని కనుక నిధులు మంజూరు విషయంలో కేంద్రం ప్రభుత్వం పాత్ర కూడా ఉంటుందన్నారు. అమరావతి నుంచి విశాఖపట్టణానికి హెచ్‌ఓడి తరలించడం ఆషామాషీ కాదన్నారు. విశాఖపట్నం భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వానికి మూడు లేఖలు రాశారని, అయినా స్పందించలేదన్నారు. విశాఖకు రాజధాని తరలిస్తామని చెప్పడం వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉందన్నారు. రాజధాని అమరావతిలో ఉండాలన్నదే బీజేపీ ముఖ్య ఉద్దేశమని కన్నా వ్యాఖ్యానించారు.
హెచ్‌ఓడి తరలించడం ఆషామాషీ కాదు : కన్నా