20–02–2020
వెలిగొండ, ప్రకాశం జిల్లా
వెలుగొండ:
వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
టన్నెల్–2 వద్ద ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శన
తర్వాత టన్నెల్æ–1లోకి అధికారులతో వెళ్లిన సీఎం, టన్నెల్–1ను పరిశీలించిన సీఎం
వెలుగొండ ప్రాజెక్టుల పనులపై తర్వాత అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సీఎం సమీక్షా సమావేశం
ఆగస్టు కల్లా మొదటి ఫేజ్‌ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం
దీనికోసం పనులను వేగంగా పూర్తిచేయాలన్న సీఎం
మొదటి టన్నెల్ పనులు నెలకు 200 మీటర్ల చొప్పున తవ్వుకుంటూ జూన్–జులై నాటికి అందిస్తామన్న కాంట్రాక్టు సంస్థ
హెడ్ రెగ్యులేటర్ పని వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
అదికూడా మూడు–నాలుగు నెలల్లో చేస్తామని వెల్లడించిన కాంట్రాక్టు సంస్థ
హెడ్ రెగ్యులేటర్‌తోపాటు అటు వైపునుంచి మొదటి టన్నెల్ పనులుకూడా పూర్తిచేస్తామన్న నిర్మాణ సంస్థ
టన్నెల్ –2ను అత్యంత వేగంగా పూర్తిచేయాలన్న సీఎం
రెండువైపుల నుంచి తవ్వకాలు చేసేదిశగా ఆలోచన చేయాలన్న సీఎం
గత ఐదేళ్లుగా వెలుగొండ పనులు ఎందుకు ముందుకుసాగలేదని ప్రశ్నించిన సీఎం
మార్చి 31లోగా మొదటి ఫేజ్‌కు సంబంధించి భూ సేకరణ పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన పనులపై ఆరా తీసిన సీఎం
గడచిన రెండేళ్లకాలంలో పనులు నిలిచిపోయాయంటూ వెల్లడించిన అధికారులు
2014–19 మధ్య మొదటి టన్నెల్‌పనులు కేవలం 600 మీటర్లే కొనసాయన్న సీఎం
గడచిన ఐదు సంవత్సరాల కాలంలో మొదటి సొరంగం పనులు 15.2 కి.మీ నుంచి 15.8 కిలోమీటర్ల మాత్రమే సాగాయని వెల్లడి
2014–2019వరకూ 600 మీటర్లు మాత్రమే కొనసాగిన మొదటి టన్నెల్ పనులు
ఈ ప్రభుత్వం వచ్చాక 8 నెలలకాలంలో 15.8 కి.మీ – నుంచి 17.2 కి.మీ వరకూ కొనసాగాయన్న సీఎం
1.4 కిలోమీటర్ల మేర సొరంగం పని ఈ 8 నెలల కాలంలో జరిగిందన్న సీఎం
అలాగే గడచిన ఐదేళ్లకాలంలో వెలుగొండ రెండో సొరంగం పనులుకూడా 10.75కి.మీ నుంచి 11.16 కి.మీ వరకే కొనసాగాయని వెల్లడి. ఐదేళ్లకాలంలో రెండో సొరంగంలో తవ్వింది కేవలం 410 మీటర్లేనని వెల్లడి
వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులుకూడా ముందుకు సాగలేదన్న అధికారులు
దీంతో వేరే సంస్థకు పనులు అప్పగించామన్న అధికారులు
మూడు–నాలుగు నెలల్లో హెడ్ రెగ్యులేటర్, అటువైపునుంచి సొరంగం పూర్తిచేస్తామన్న కాంట్రాక్టు సంస్థ
వచ్చే ఆగస్టు నాటికి ఆయకట్టుకు నీరందించడానికి పనులపరంగా, ఆర్ అండ్ ఆర్ పరంగా ఉన్న సమస్యలపై సమీక్షా సమావేశంలో దృష్టిపెట్టిన సీఎం
వాటి ప్రగతిని వివరించిన అధికారులు, అలాగే ప్రస్తుతం నెలకొన్న అంశాలపైనా దృష్టి
పాతకాంట్రాక్టు సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి వేరే సంస్థకు అప్పగించాలన్న సీఎం
వెలుగొండ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఒక్కో నిర్వాసితుల కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు సీఎం అంగీకారం
పుల్లల చెరువు మండలంలో టీ–5 బ్లాక్ వద్ద అదనంగా కాల్వ తవ్వకం ద్వారా 11,500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి అదనంగా రూ.70 కోట్లు అవుతాయని, ఆపనులు మంజూరుచేయాలని కోరిన మంత్రి ఆదిమూలపు సురేష్
దీనివల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మేలు జరుగుతుందన్న మంత్రి
అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం
ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీఎం
వెలుగొండ ఈస్ట్రన్ కెనాల్ ద్వారా రాళ్లపాడు రిజర్వాయర్‌కు నీరు ఇవ్వాలని కోరిన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
వెలుగొండ ఈస్ట్రన్ కెనాల్ నుంచి సబ్ కెనాల్ ద్వారా సమీపంలో వాగుకు, అక్కడనుంచి రాళ్లపాడుకు నీరందించాలన్న మహీధర్‌రెడ్డి
సానుకూలంగా స్పందించిన సీఎం, అధికారులకు ఆదేశాలు
సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్‌కుమార్, బాలినేని, విశ్వరూప్
ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి
ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, వేణుగోపాల్, మహీధర్‌రెడ్డి,
నాగార్జున, అన్నా రాంబాబు తదితరులు.త
సమావేశంలో పాల్గొన్న ఇరిగేషన్ శాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, కలెక్టర్ పోలా భాస్కర్ ఇతర అధికారులు