ప్లాస్టిక్ నిషేధంలో  టీటీడీ ముందంజను ప్రశంసించిన  - 'నేషనల్ ఎర్త్ నెట్ వర్క్'

25.02.20, తాడేపల్లి
...............
ప్లాస్టిక్ నిషేధంలో  టీటీడీ ముందంజను ప్రశంసించిన 
- 'నేషనల్ ఎర్త్ నెట్ వర్క్'


పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ ను నిషేధించడంలో టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) పలు చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో ప్రత్యామ్నాయాలను  చేపట్టింది... టిటిడి ప్లాస్టిక్ నిషేధం కోసం చేపట్టిన చర్యలపై  ఢిల్లీకి చెందిన స్వచ్చంద సంస్థ నేషనల్ ఎర్త్ నెట్ వర్క్ ప్రశంసలు కురిపించారు...


మంగళవారం తాడేపల్లిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ సమన్వయకర్త జి.అక్షయ్, ఏపీ టీమ్ సభ్యులు రిఖీ, భరత్ చంద్ కలిసి ప్రసంసాపత్రాన్ని (certificate of appreciation) అందజేశారు. ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం టిటిడి అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాగా భక్తులు  తిరుమలకు ఎక్కువ భాగం బస్సుల్లో చేరుకుంటారని దీనితో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపేటనున్నట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోందని ఆయన చెప్పారు. తిరుమలతోపాటు తిరుపతిలో కూడా ప్లాస్టిక్ నిషేధం పూర్తి స్థాయిలో అములు చేసేందుకు టిటిడి అన్ని వేళాల ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణపై ఎనలేని కృషి చేస్తున్న నేషనల్ ఎర్త్ నెట్ వర్క్' టీటీడీ చర్యలను ప్రశంసించడంతో దేవస్థానం  బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image