రీసర్వేతో భూవివాదాలకు చరమగీతం

*17.02.2020*
*అమరావతి*


రీసర్వేతో భూవివాదాలకు చరమగీతం


*స్వచ్ఛీకరణ తర్వాత సమగ్ర రీసర్వే* 


*ఎప్పటికప్పుడు మ్యుటేషన్లు*


*ఏటా రెవెన్యూ జమాబందీ*


*రేపు ప్రయోగాత్మకంగా రీ సర్వేకి శ్రీకారం* 


భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా భూములను సర్వే చేసి రీసర్వే రిజిష్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) తయారు చేశారు. నేటికీ ఇదే ప్రామాణికంగా ఉంది. ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేయాల్సి ఉన్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు.  *లెక్కలేనన్ని మార్పులు చేర్పులు* 


తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం తదితర కారణాలతో భూములు చేతులు మారడంవల్ల గత 120 ఏళ్లలో భూముల పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. ప్రభుత్వ భూములకు దరఖాస్తు పట్టాలు (డీకేటీలు) ఇవ్వడంవల్ల సబ్‌డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దుల విషయంలోనూ వివాదాలు పెరిగాయి. చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలపాలయ్యాయి. వాస్తవంగా ఉన్న భూమికీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న దానికీ మధ్య లక్షల ఎకరాల తేడా ఏర్పడింది. భూరికార్డులు సక్రమంగా లేనందున సివిల్‌ కేసుల్లో భూ వివాదాలకు సంబంధించినవే 60 శాతంపైగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రికార్డుల స్వచ్ఛీకరణ, భూముల రీసర్వే, శాశ్వత భూ హక్కుల కల్పనే ఇలాంటి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు చెప్పడంతో శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ చర్యలకు సాహసోపోత నిర్ణయాలు తీసుకుంది.  


*కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బేస్‌ స్టేషన్, రేపు రీసర్వే ప్రారంభం*


రాష్ట్ర వ్యాప్తంగా భూములను సమగ్ర రీసర్వే చేయాలని నిర్ణయించిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో పైలట్‌ ప్రాజెక్టుకు ఈనెల 18న (మంగళవారం) శ్రీకారం చుట్టనుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేటలో బేస్‌ స్టేషన్‌ను ప్రారంభించి తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్‌ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి శ్రీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభిస్తారు. తదుపరి మండలంలోని 25 గ్రామాల్లోగల 66,761 ఎకరాల భూముల్లో రీసర్వే పూర్తి చేస్తారు. ఇక్కడ వచ్చే అనుభవాలతో అవసరమైన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం త్వరితగతిన ప్రక్రియను చేపట్టనుంది.  


*రైతులపై నయాపైసా భారం లేదు: ఉప ముఖ్యమంత్రి శ్రీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌* 


ప్రస్తుతం ఎవరైనా రైతు తన భూమిని సర్వే చేయించుకోవాలంటే మీసేవలో రుసుం చెల్లించాలి. అయితే  భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టుకు రూ.2000 కోట్ల వ్యయం అవుతున్నా రైతులపై నయాపైసా కూడా భారం మోపకుండా మొత్తం ప్రభుత్వమే భరించాలని సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి శ్రీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా దేశాల్లో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 2022 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసి పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image