ఎపిఎంఎఫ్ డైరీ ఆవిష్కరించిన  టిటిడి ఛైర్మన్ 

ఎపిఎంఎఫ్ డైరీ ఆవిష్కరించిన  టిటిడి ఛైర్మన్ 
తాడేపల్లి, ఫిబ్రవరి 26: జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని  తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2020 డైరీని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎపిఎంఎఫ్ కార్యక్రమాలను ఆయన అభినందించారు. మార్చి 4, 5 తేదీలలో మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం కావాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి, ఎపిఎంఎఫ్ ప్రతినిధి బి. సతీష్ బాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.