లాక్ డౌన్ పిరియడ్ లో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

లాక్ డౌన్ పిరియడ్ లో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి,


కర్నూలు, మార్చి,29 (అంతిమతీర్పు):-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఎల్లవేళలా లాక్ డౌన్ పిరియడ్ లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు లకు లాక్ డౌన్ పీరియడ్ లో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆదుకోవాలని ఒక్కొక్క జర్నలిస్టుకు నెలకు  30 వేల రూపాయలు, మరియు జీవిత భీమా 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని  
స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పత్తికొండ నియోజకవర్గ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ కారుణంగా లాక్ డౌన్ ప్రకటించిన తరుణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం శోచనీయమని అన్నారు. ఎంతో శ్రమించి సదుపాయాలు ఏమి లేక పోయినా కోవిడ్-19, గురించి నిరంతరం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తూ  జర్నలిస్టులు  కూడా ఈ వైరస్ కు భళి అవుతున్న సందర్భాలు  చూస్తున్నామని తెలిపారు. అందరికీ అన్ని సదుపాయాలు కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం  కానీ జర్నలిస్టులకు మాత్రం ఎటువంటి సదుపాయాలను కల్పించకుండా  విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు  జాతీయ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులకు  లాక్ డౌన్ పీరియడ్ లో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఒక్కొక్క   జర్నలిస్ట్ కు నెలకు 30 వేల రూపాయల ప్రకారం ఇచ్చి ఆదుకోవాలని మరియు దానితో పాటు జీవిత బీమా సంస్థ కింద ఒక్కొక్క జర్నలిస్టుకు 30 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా  ప్రకటించాలనిపత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు.