ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?: చంద్రబాబు

ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?: చంద్రబాబు
అమరావతి: స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మీడియా సమావేశం ద్వారా అజ్ఞానాన్ని ఆయన బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కరోనా వైరస్‌ మహమ్మారిగా మారిందని.. దీని బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటిందని.. 5వేల మందికి పైగా చనిపోయారని చెప్పారు. చైనా, ఇటలీ దేశాల్లో ఔషధ దుకాణాలు తప్ప అన్నింటినీ మూసివేశారన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అమెరికా రూ.3.50లక్షల కోట్లు కేటాయించిందని చంద్రబాబు వివరించారు. ఈ మహమ్మారి ప్రభావంతో లండన్‌లోనూ స్థానిక ఎన్నికలను నిలిపివేశారని ఆయన గుర్తు చేశారు. పరిస్థితి ఈ స్థాయిలో ఉన్నా జగన్‌ ఎస్‌ఈసీపై ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఎవరు చెప్పినా వినరు అనేదానిపై సీఎం జగన్‌ వ్యాఖ్యలే ఉదాహరణ అని ఆక్షేపించారు. 
ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారా?
కరోనా వైరస్‌ చాలా ప్రమాదకరమని అన్ని దేశాలు హెచ్చరిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. కరోనా వ్యాప్తి చెందితే మనదేశంలో ఆస్పత్రులు కూడా సరిపోవని.. గ్రామాలన్నీ క్వారంటైన్లు మారిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఈ సీఎంకు లేదని.. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా? అని జగన్‌ను ప్రశ్నించారు. ‘‘ఏ ఒక్క రాష్ట్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దేశం మొత్తానికి ప్రమాదం. ఒక సీఎం ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారా? జగన్‌కు సర్వాధికారాలు ఎవరిచ్చారు? రాజ్యాంగం నుంచే ఆయనకు అధికారాలు వచ్చాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ. ఎన్నికల నియమాలు అన్ని పార్టీలకు ఒకే విధంగా ఉంటాయి. రాజకీయాలు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఈ సీఎంకు పట్టడం లేదు’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. 
రమేశ్‌కుమార్‌ను మేం నియమించలేదు
స్థానిక ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటే తాము గౌరవించాలా? అని ప్రశ్నించారు. తెదేపా నేతల ఇంటికి తెల్లవారుజామునే వెళ్లి బెదిరించారని.. 111 మంది తెదేపా అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని చెప్పారు. పులివెందుల రాజకీయాన్ని రాష్ట్ర మొత్తం చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. ‘‘నేను అధికారంలో ఉన్నప్పుడూ ఇలాగే చేసి ఉంటే వైకాపా పరిస్థితి ఎలా ఉండేది? ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను మేం నియమించలేదు. నేను సీఆర్‌ బిశ్వను ఎస్‌ఈసీగా ప్రతిపాదించా. అప్పటి గవర్నర్‌ గవర్నర్‌ నరసింహన్‌ మాత్రం రమేశ్‌కుమార్‌ను ప్రతిపాదించారు. ఆవిధంగా రమేశ్‌కుమార్‌ నియామకం జరిగింది. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ఆయన నియామకాన్ని జగన్‌ నాకు ఆపాదిస్తున్నారు’’ అని తెదేపా అధినేత వివరించారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image