యనమల రూ. లక్ష విరాళం
అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రూ. లక్ష విరాళం ప్రకటించారు. ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేతలు, కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. విపత్తులను ఎదుర్కోవడంలో, బాధితులను ఆదుకోవడంలో టీడీపీకి సాటిలేదని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
యనమల రూ. లక్ష విరాళం