పోలీసులను దేశ సైనికులుగా భావించాలి

విశాఖ శారద పీఠంలో ముగిసిన యాగం
తెలుగు రాష్ట్రాల సీఎంల ఆదేశాలను ప్రజలు పాటించాలి
పోలీసులను దేశ సైనికులుగా భావించాలి
స్వరూపానందేంద్ర సరస్వతి
 విశాఖపట్నం: సర్వ మానవాళి ఆరోగ్యంతో ఉండాలని విష జర్వ పీడ హర యాగం నిర్వహించామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. కరోనా నివారణ కోసం విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో 11 రోజుల పాటు నిర్వహించిన యాగం శనివారంతో విజయవంతంగా ముగిసింది. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. ప్రపంచానికి గురుస్థానంలో భారతదేశం  ఉందని.. మానవులంతా ఆరోగ్యంతో ఉండాలని ఈ యాగం చేశామని తెలిపారు. వేదాల్లో అనేక అంశాలను పరిశీలించి యాగం తలపెట్టామని ఆయన పేర్కొన్నారు. అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు, ధన్వంతరి జపం, అపమృత్యు దోష నివారణతో కూడిన మంత్రాలతో యజ్ఞం చేసామని వివరించారు.
ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ల ఆదేశాలను ప్రజలందరూ పాటించాలని స్వరూపానందేంద్ర సరస్వతి విజ్ఞప్తి చేశారు. శారదాపీఠం భక్తులంతా అన్నార్థులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులను దేశ సైనికులుగా భావించి గౌరవించాలని పేర్కొన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి టీటీడీ, దేవాదాయ శాఖ అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image