<no నగర పాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం

నగర పాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం
●నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ
●కట్టుదిట్టమైన పోలీసు భద్రత
●అందుబాటులో హెల్ప్‌ డెస్క్‌
జిల్లా కేంద్రం ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, ఏర్పాట్లను పూర్తి చేశారు. కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశాల మేరకు నగర కమిషనర్‌ చంద్రశేఖర్‌ దీనికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు.
ఏలూరు : ఏలూరు నగరంలో 2,47,631 మంది ఓటర్లు ఉండగా వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో దానికి అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేశారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు కార్పొరేషన్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. అధికారులకు తగు సూచనలు, సలహాలను అందిస్తూ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 13 మంది రిటర్నింగ్‌ అధికారులను మరో 13 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో  అవసరానికి ఉపయోగపడేలా మరో ఆరుగురు అధికారులను రిజర్వ్‌లో ఉంచారు.
మూడు రోజులూ హడావుడే
నామినేషన్‌ ప్రక్రియ ఈనెల 11న ప్రారంభమై మూడు రోజుల పాటు 13వ తేదీ వరకు ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో ఈ మూడు రోజులూ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. నామినేషన్‌ ప్రక్రియ నేపథ్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు, వారికి సహాయకులు మాత్రమే కార్పొరేషన్‌ కార్యాలయంలోకి ప్రవేశించాలి. మిగిలిన అనుచర గణాన్ని కార్పొరేషన్‌ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో నిలిపివేస్తారు. ఊరేగింపులు, తీన్‌మార్‌ డ్యాన్సులు వంటివి అనుమతించరు.
పోలింగ్‌ బూత్‌లు సిద్ధం.. 
ఎన్నికల పోలింగ్‌ నిమిత్తం నగరంలో 216 బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్నికలకు 1,296 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. నలుగురు జోనల్‌ అధికారులు, 12 మంది రూట్‌ ఆఫీసర్లను రంగంలోకి దింపారు. దీంతో పాటు అభ్యర్థుల ప్రచారపర్వాన్ని పర్యవేక్షించేందుకు నిబంధనలను మీరితే చర్యలు చేపట్టేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను, సంచార బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తారు. అంతే కాకుండా బూత్‌ల వద్ద అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేశారు. విద్యుత్తు, తాగునీటి వసతి, పరిసరాల పరిశుభ్రత, ఇతర ఏర్పాట్లు చేశారు.
84 సమస్యాత్మక ప్రాంతాలు
నగరంలోని 50 డివిజన్లకు సంబంధించి 84 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. దీంతో అక్కడ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పోలీసు బూత్‌ల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి వీటిని పర్యవేక్షిస్తారు. బూత్‌ల వద్ద గందరగోళ వాతావరణం ఏర్పడితే వెబ్‌ కెమెరాల ద్వారా తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటి నుంచే గమనిస్తూ పోలింగ్‌ నాడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే సిద్ధం చేశాం. సిబ్బందికి ప్రత్యేక కార్యాచరణ నిర్వహించి శిక్షణ అందించాం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న దృష్ట్యా అంతా అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాం. నామినేషన్ల దగ్గర నుంచి కౌంటింగ్‌ వరకు ప్రత్యేక శ్రద్ధతో అంతా పనిచేసేలా ఆదేశాలు జారీ చేశాం. నగర పాలక సంస్థలో విలీన గ్రామాలు కలవడంతో అభ్యర్థులు తికమక పడకుండా తమ వార్డుల్లోని ఓట్లను, సరిహద్దులను గమనించి ముందుకెళ్లాలని కోరుతున్నాం. సందేహాలుంటే నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. - చంద్రశేఖర్‌, నగర కమిషనర్‌


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు