సామాజికదూరం పాటించకపోతే ఇబ్బందుల్లో పడతాం: జగన్

సామాజికదూరం పాటించకపోతే ఇబ్బందుల్లో పడతాం: జగన్
అమరావతి : సామాజికదూరం పాటించకపోతే ఇబ్బందుల్లో పడతామని సీఎం జగన్ హెచ్చరించారు. నాలుగు చోట్ల క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశామని తెలిపారు. 80.9శాతం మందికి ఇళ్లలో ఉంటేనే వ్యాధి నయమవుతుందని చెప్పారు. వృద్ధులు, చిన్నారులపైనే కరోనా ప్రభావం చూపుతుందని, విశాఖ, తిరుపతి, నెల్లూరు, విజయవాడలో 470 ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ 200 పడకలను సిద్ధం చేశామని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. మరో 213 వెంటిలేటర్లు సిద్ధం చేశామని, కరోనా కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1902 ఏర్పాటు చేశామని జగన్ పేర్కొన్నారు. ఆరోగ్య పరమైన సమస్యలుంటే 104కు ఫోన్‌ చేయాలని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామని, అధికారులతో ముగ్గురు మంత్రులు ఎప్పుడూ పర్యవేక్షిస్తారని చెప్పారు. సీఎం ఆఫీసు నుంచి కూడా పర్యవేక్షణ ఉంటుందన్నారు. నిత్యావసర సరుకుల వాహనాలన్నింటికీ అనుమతులిచ్చామని, ప్రతి 3 కిలోమీటరుకు ఒక రైతుబజార్‌ను ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు.