విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లోథర్డ్ జెండర్స్ కు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి
నెల్లూరు /వెంకటాచలం, ఏప్రిల్ 13. (అంతిమ తీర్పు): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జిల్లా లోని జనార్ధన రెడ్డి నగర్ లో నివసిస్తున్న సుమారు 60 మంది థర్డ్ జెండర్స్ (హిజ్రాలకు) బియ్యం నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా NSS సమన్వకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం పాల్గొని అందరికి వస్తువులు పంపిణి చేశారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు, రిజిస్ట్రార్ డా. యల్ విజయకృష్ణా రెడ్డి గారి సూచనల మేరకు జిల్లాలో ప్రభుత్వము నుంచి ఎటువంటి సాయం అందని వారికి చేయూతనివ్వటానికి NSS ముందుకొచ్చిందని అన్నారు. థర్డ్ జెండర్స్ రోజూ బిక్షాటన చేసుకొని జీవనోపాధి సాగిస్తున్నారని ప్రస్తుతం నెలకొని వున్న లాక్ డౌన్ వలన వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులను కొన్ని వార్తా చానెల్స్ ద్వారా తెలుసుకొని వారికి విశ్వవిద్యాలయం తరపున తమవంతు సాయం చేశామన్నారు. థర్డ్ జెండర్స్ అధ్యక్షరాలైన శ్రీమతి అలేక్య మాట్లాడుతూ తమ బాధలను అర్ధం చేసుకొని మాకు సహాయం చేయటానికి ముందుకు వచ్చిన విశ్వవిద్యాలయం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో NSS ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్ కుమార్, కృష్ణ చైతన్య డిగ్రీ కాళాశాల NSS వాలంటీర్లు మరియు NCC కేడీదాట్లు పార్ధసారధి, రాజేష్, శివరాజ్, చైతన్య, ప్రేమ్ చంద్ , కావ్య మరియు జోస్త్న పాల్గొన్నారు