ఈనెల 15 వ తేదీ నుండి ప్రారంభమయ్యే రెండవ విడత ఉచిత రేషన్ కు ఏర్పాట్లు :మంత్రి కొడాలి

విజయవాడ
5.4.2020


- రాష్ట్రంలో 1.18 కోట్ల రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలను పంపిణీ చేశాం
- ఈనెల 15 వ తేదీ నుండి ప్రారంభమయ్యే రెండవ విడత ఉచిత రేషన్ కు ఏర్పాట్లు
- 13వ తేదీ నాటికి గోదాముల నుండి రేషన్ షాపులకు సరఫరా
- రేషన్ షాపుల్లో కూపన్ల వారీగా
 సరుకుల పంపిణీ
- బియ్యంతో పాటు ఈసారి ఉచితంగా కేజీ శెనగపప్పు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)


                 
 రాష్ట్రంలో 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే రెండవ విడత ఉచిత రేషన్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాలు,  వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఆదివారం మంత్రి కొడాలి నాని క్యాంప్ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 13వ తేదీ నాటికి గోదాముల నుండి రేషన్ షాపులకు నిత్యవసర సరుకులను సరఫరా చేస్తామన్నారు. గత నెల 29వ తేదీ నుండి మొదటి విడత రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఒక కోటి 18 లక్షల ఒక వెయ్యి 827 రేషన్ కార్డులకు నిత్యావసరాలను సరఫరా చేశామని, ఈనెల 14వ తేదీ వరకు పంపిణీ జరుగుతుందన్నారు. 15 వ తేదీ నుండి జరిగే రెండో విడత రేషన్ పంపిణీలో కార్డులోని ప్రతి ఒక్కరికి ఐదు కేజీల చొప్పున బియ్యం, ఈసారి కందిపప్పు స్థానంలో ప్రతి రేషన్ కార్డుకు కేజీ శనగపప్పును ఉచితంగా అందజేస్తామన్నారు. రేషన్ షాపుల్లో రద్దీ నియంత్రణకు ఈసారి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాలంటీర్ల ద్వారా కూపన్ లను జారీ చేస్తామన్నారు. కూపన్ ల  వారిగానే రేషన్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులను సరఫరా చేస్తామన్నారు. పేద ప్రజల ఆకలి బాధలను తీర్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీ కొడాలి నాని చెప్పారు.


కాగా ఆదివారం రాష్ట్రంలోని 6 లక్షల 25 వేల 567 రేషన్ కార్డులకు 10 వేల 874 మెట్రిక్ టన్నుల బియ్యం, 706 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని మంత్రి శ్రీ కొడాలి నాని చెప్పారు.


 అలాగే రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 47 లక్షల 24 వేల 017 రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. వీటిలో ఇప్పటి వరకు ఒక కోటి 18 లక్షల 01 వేల 827 రేషన్ కార్డులకు మొత్తం ఒక లక్ష 89 వేల 601 మెట్రిక్ టన్నుల బియ్యం, 10 వేల 960 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.


 అనంతపురం జిల్లాలో 12 లక్షల 23 వేల 684 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటి వరకు 9 లక్షల 98 వేల 689 రేషన్ కార్డులకు 17 వేల 454 మెట్రిక్ టన్నుల బియ్యం, 759 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామన్నారు. 


అలాగే చిత్తూరు జిల్లాలో 11 లక్షల 33 వేల 535 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 9 లక్షల 86 వేల 581 రేషన్ కార్డులకు 17 వేల 090 మెట్రిక్ టన్నుల బియ్యం, 977 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 


తూర్పుగోదావరి జిల్లాలో 16 లక్షల 50 వేల 254 రేషన్ కార్డులు ఉండగా, వీటిలో 13 లక్షల 35 వేల 445 రేషన్ కార్డులకు 20 వేల 296 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 1, 052 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు. 


గుంటూరు జిల్లాలో 14 లక్షల ఎనభై తొమ్మిది వేల 439 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 12 లక్షల 31 వేల 800 రేషన్ కార్డులకు 18 వేల 926 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 204 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 


కడప జిల్లాలో 8 లక్షల 02 వేల 039 రేషన్ కార్డు లు ఉండగా, వీటిలో 6 లక్షల 64 వేల 878 రేషన్ కార్డులకు 11 వేల 124 మెట్రిక్ టన్నుల బియ్యం, 661 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని పేర్కొన్నారు. 


కృష్ణాజిల్లాలో 12 లక్షల 92 వేల 937 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 10 లక్షల 58 వేల 293 రేషన్ కార్డులకు 16 వేల 378 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 043 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. 


కర్నూలు జిల్లాలో 11 లక్షల 91 వేల 344 రేషన్ కార్డు ఉండగా, వీటిలో 8 లక్షల 97 వేల 450 రేషన్ కార్డులకు 15 వేల 140 మెట్రిక్ టన్నుల బియ్యం, 873 మెట్రిక్ టన్నుల కంది పప్పును సరఫరా చేశామని తెలిపారు. 


నెల్లూరు జిల్లాలో 9 లక్షల 04 వేల 220 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 7 లక్షల 293 రేషన్ కార్డులకు 10 వేల 735 మెట్రిక్ టన్నుల బియ్యం, 561 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామన్నారు. 


ప్రకాశం జిల్లాలో 9 లక్షల 91 వేల 822 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 7 లక్షల 91 వేల 528 రేషన్ కార్డులకు 12 వేల 471 మెట్రిక్ టన్నుల బియ్యం, 785 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని తెలిపారు. 


శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల 29 వేల 024 రేషన్ కార్డు లు ఉండగా, వీటిలో 5 లక్షల 48 వేల 672 రేషన్ కార్డులకు 8 వేల 686 మెట్రిక్ టన్నుల బియ్యం, 524 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు. 


విశాఖపట్నం జిల్లాలో 12 లక్షల 45 వేల 266 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 9 లక్షల 36 వేల 453 రేషన్ కార్డులకు 14 వేల 735 మెట్రిక్ టన్నుల బియ్యం, 884 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని చెప్పారు. 


విజయనగరం జిల్లాలో 7 లక్షల 10 వేల 528 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 5 లక్షల 94 వేల 920 రేషన్ కార్డులకు 10 వేల 294 మెట్రిక్ టన్నుల బియ్యం, 592 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామన్నారు. 


పశ్చిమగోదావరి జిల్లాలో 112 లక్షల 59 వేల 925 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 10 లక్షల 56 వేల 825 రేషన్ కార్డులకు 16 వేల 267 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 039 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని మంత్రి శ్రీ కొడాలి నాని చెప్పారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image