15 రకాల సరుకులతో కూడిన ఐదువేల కిట్లు రెడి

రాష్ట్రంలో కరోనా వలన అన్ని వ్యవస్థలు స్తంభించిపోయిన తరుణంలో వలస వచ్చిన కార్మికులు మరియు  వారి  కుటుంబాల పరిస్థితి అక్కడక్కడ కొంచెం ఆందోళనకరంగా మారింది..ప్రభుత్వం అన్ని విధాలా వారిని ఆదుకుంటున్నప్పటికి  మరింతగా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కనెక్ట్ టూ ఆంధ్రా సీఈఓ వి.  కొటేశ్వరమ్మ  పలు mnc కంపెనీ లకి రాష్ట్రం లో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని లేఖ రూపం లో తెలియచేసారు... రాష్ట్రం లో వలస వచ్చిన కూలీలు,పేదవారు కొంత ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని లేఖలో కోరారు..ఈ సందర్బంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ,విప్రో,
డాక్టర్..రెడ్డీస్ లాబొరేటరీస్,టాటా సన్స్ అండ్ ట్రస్ట్ లకి లేఖలు రాయగా తమ వంతు సాయ0 అందించడానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అన్నవరం లలిత బ్రాండ్ రైస్ కంపెనీ వారు ముందుకు వచ్చారు..ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారు  ఐదువేల కుటుంబాలని ఆదుకునే విదంగా  15 రకాల సరుకులతో ,ఐదువేల కిట్ లని అందించేందుకు ముందుకు వచ్చారు..ఈ కిట్ లో 
బియ్యం..- 5 కిలోలు,
సాల్ట్ -కేజీ,
సెనగలు- పావుకిలో,
నూనె -పావు లీటర్,
రసం పౌడర్- 200 గ్రాములు,
సాంబార్ పౌడర్- 200 గ్రాములు,
పసుపు -100 గ్రాములు,
కారం- 100 గ్రాములు, 
ప్రియా పచ్చడి-  200 గ్రాములు,
షుగర్- కేజీ,
గోధుమ పిండి-1 కేజీ,
బంగాళాదుంపలు-2 కిలోలు
మంగుళూరు దోసకాయలు- 2 కిలోలు 
అల్లం- 200 గ్రాములు 
ఇలా 15 రకాల సరుకులతో కూడిన ఐదువేల కిట్ లని ఐదు వేల కుటుంబాలకు అందచేయటానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ ముందుకు వచ్చింది.. దీనితో పాటు డాక్టర్..రెడ్డీస్ లాబొరేటరీస్ సంస్థ వారు కూడా పదివేల కుటుంబాలని ఆదుకునేందుకు తమ వంతు సాయంగా 
10 టన్నుల బియ్యం,
10 టన్నుల కందిపప్పు 
10 వేల లీటర్ల ఆయిల్,
10 వేల కిలోల ఉప్పు,
కారం 200 గ్రాముల చొప్పున 10వేల పాకెట్లు...
ఇవన్నీ పదివేల కుటుంబాలకు అందించేందుకు పదివేల కిట్ లుగ ఏర్పాటు చేసి ఇవ్వటానికి ముందుకు వచ్చారు..దీనితో పాటు
అన్నవరం నుంచి లలితా బ్రాండ్ కంపెనీ వారు పది టన్నుల బియ్యాన్ని ఇస్తున్నట్టు వి .కొటేశ్వరమ్మ తెలియచేసారు..కరోనా నేపధ్యం లో పేదవారికి,వలస కూలీలని ఆదుకునేందుకు మరిన్ని కంపెనీ లు ముందుకు వచ్చే విదంగా వారితో చర్చలు జరుపుతున్నట్టు కొటేశ్వరమ్మ ప్రకటించారు..
వీటన్నింటిని రానున్న రెండు రోజుల్లో అగ్రికల్చర్ కమీషనర్ కార్యాలయం ద్వారా పలు గ్రామాలలో వలస కుటుంబాలని గుర్తించి వారికి అందచేయనున్నామని కొటేశ్వరమ్మ తెలిపారు..


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image