ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ :సీఎం జగన్మోహన్ రెడ్డి

12–04–2020
అమరావతి


*రాష్ట్రంలో అందరికీ మాస్కులు పంపిణీ*
*ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ*
*సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు*
*హైరిస్కు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం*అమరావతి: కోవిడ్‌ నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
సీఎం నివాసంలో జరిగిన సమీక్షా సమావేశానికి సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు


రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ చేయాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం
రాష్ట్రంలో ఉన్న  సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం
మాస్క్‌ల వల్ల కొంత రక్షణ లభిస్తుంది: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌
వీలైనంత త్వరగా వీటిని పంపిణీచేయాలని అధికారులకు సీఎం ఆదేశం


రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని వెల్లడించిన అధికారులు ( శనివారం రాత్రికి)
32,349 మందిని వైద్యాధికారులకు రిఫర్‌చేసిన ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు
ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని నిర్ధారించిన మెడికల్‌ ఆఫీసర్స్‌
వీరేకాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశం


కోవిడ్‌కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల కోవిడ్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న వైద్య శాఖ
వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈపరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వెల్లడి
కోవిడ్‌ వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామన్న అధికారులు


హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం
వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం
వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించిన సీఎం
వీరిపట్ల అనుసరించాల్సిన వైద్య విధానాలు, ప్రక్రియలను కింది స్థాయి వైద్య సిబ్బందివరకూ చేరవేయాలని, ఉత్తమమైన, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్న సీఎం


అలాగే నమోదవుతున్న కేసులు, వ్యాప్తిచెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్న సీఎం
భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టంచేసిన సీఎం
రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న సీఎం
ఎక్కడా కూడా జనం గమిగూడకుండా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం


నమెదైన కేసుల వివరాలను సీఎం ముందు ఉంచిన అధికారులు
మొత్తం నమోదైన కేసులు 417 (ఉదయం 9 గంటల వరకూ)
వీరిలో విదేశాలనుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసులు 13, వారిద్వారా సోకిన కేసులు సంఖ్య 12
ఢిల్లీ వెళ్లిన వారిలో పాజిటివ్‌ కేసులు 199, వారిద్వారా సోకిన వారు 161
మిగిలిన పాజిటివ్‌కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల, వ్యాధి సోకిన వారు, వారిద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32 మంది ఉన్నారు.


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image