కస్తూరీబాయ్ 1869 ఏప్రిల్ 11 న జన్మించారు

కస్తూరీబాయ్  మఖాన్ జి కపాడియా 11-4-1869 లో ఏ రాష్ట్రం కతియవాడ్  ఏజెన్సీ బొంబాయ్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్ భారతదేశం) లో జన్మించారు. తండ్రి గోకుల్ దాస్ మెకంజీ కపాడియా, తల్లి వ్రజ్  కున్వర్ బా కపాడియా దంపతులకు జన్మించింది.  వృత్తిరీత్యా కుటుంబమైన గోకుల్ దాస్ మఖాన్ జి కపాడియా మరియు కరమ్  చంద్ గాంధీ  ఇరువురు ఇరుగుపొరుగు నా నివసిస్తూ ప్రాణ స్నేహితులు గా ఉండటం వల్ల వారి స్నేహం బలపడేందుకు కస్తూర్బా, గాంధీలవివాహం 1876లో పదేళ్ళ వయసులో మోహన్‌దాస్ గాంధీ -కస్తూర్ మఖాంజీ కపాడియాల నిశ్చితార్థం జరిగింది. 13 ఏట 1882 లో వారి వివాహం సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిగింది.ఆడపిల్లలు చదువుకోవడం, మగ పిల్లలతో కలసి ఆడుకోవడం పోర్‌బందరు బనియాలలో చాలా దోషం. అంతే కాదు ఏడేళ్ళు దాటగానే పెళ్ళి చేయడం సంప్రదాయం. అందువల్ల ఆమె అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యురాలిలానే పెరిగింది.   ఆమె అత్తగారు పుత్లీబాయి హిందూ-ముస్లిం ఉమ్మడి ప్రార్థనలకు సంబంధించిన మత సంప్రదాయం పేరు "ప్రణామీ" సంప్రదాయాన్నీ ఆచరించేవారు.  అత్తగారి ఆచారాలను, భర్త ఆంక్షలతో అనేక ఆటుపోట్ల ఎదుర్కొని, తన ఒంటి మీద బంగారాన్ని అమ్మి గాంధీజీని చదువుకు లండన్ కి పంపి తిరిగి వచ్చేవరకూ అత్తగారింట్లో  గడిపారు. భారతదేశంలో గాంధీకి  ప్లీడరుగా అనేక అడ్డంకులు కారణంగా అబ్దుల్లా కంపెనీకి వకీలుగా దక్షిణాఫ్రికా వెళ్ళేటప్పటికి ఇద్దరు పిల్లల తల్లి బాధ్యత వహిస్తూ ఏడాది తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడ గాంధీ గారి ఉద్యమాలలో చేదోడువాదోడుగా ఉంటూ,  ఫినిక్స్ , టాల్స్టాయ్ ఆశ్రమాలలో ముఖ్య పాత్ర వహిస్తూ,ఆశ్రమంలో నివసిస్తున్న సభ్యులందరితో సఖ్యతవహిస్తూ,ఆశ్రమ జీవితం గడిపారు.ఇంటికి వచ్చిన అతిధులకు సేవలు చేస్తూ,అనేక అవమానాలను ఎదుర్కొంటూ, ఒకానొక సమయంలో గాంధీగారు "బా"ని గెంటి వేసిన సందర్భంలో ఆవిడ కంటినీరు చూసిన సన్నివేశం,నేనే కనుక చిత్రకారుని అయితే ఒక తైలవర్ణ చిత్రాన్నివేసేవాణ్ని అని,ఆమె వహించిన ఓర్పు తర్వాతి కాలంలో సత్యాగ్రహానికి ఉపయోగపడిందని,అనేక సందర్భాలలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా మాంసాహారం స్వీకరించకుండా ప్రకృతి వైద్యం తోనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శ జీవితం గడిపారని ఆత్మకథలో గాంధీగారు తెలిపారు.  దక్షిణాఫ్రికాలోనే కస్తూరిబా ఉద్యమాలకు  పునాది ఏర్పడింది.దంపతులకు నలుగురు సంతానం హరిలాల్, మణిలాల్ దేవదాస్, రామ్ దాస్ ల  చదువుల విషయంలో ఇద్దరి మధ్య అనేక విభేదాలు ఏర్పడినవి. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వస్తూ వెల కట్టలేని గౌరవ అభిమానాన్ని పొంది 1915లో భారతదేశానికి తిరిగి వచ్చారు. తర్వాత కోచ్రోరోబ్ ఆశ్రమాన్ని నెలకొల్పి, ఆడపిల్లలు లేని కారణంగా లక్ష్మీ అనే దళిత కుటుంబీకుల బిడ్డను దత్తత చేసుకుని, కూతురు గా భావించి ఎంత ప్రేమగా పెంచారు.ఆ దత్తత అనేక వివాదాలు,విభేదాలకు కారణమై 1915 లో సబర్మతిఆశ్రమమాన్ని  స్థాపించడం, రాట్నం పై ఖాదీ వడకటం, ఖాదీ వస్త్రాలను ధరించడం జరిగింది.  విదేశీ వస్త్ర బహిష్కరణ కాలంలో దాదాబాయ్ నౌరోజీ గారు ఇచ్చిన విదేశీ చీర తగులపెట్టాల్సి వచ్చినపుడు తానెంతో మనస్తాపం చెందిన ని అలాంటి సందర్భం తన జీవితంలో మొట్టమొదటిసారి జరిగిందని,ఆశ్రమంలో గాంధీ గారిపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన కస్తూరిబా గాంధీ ఎలాంటి అపోహలకులోను కాకుండా ఆశ్రమవాసులు ని సమాధాన పరిచటం,  అక్కడి మహిళలందరూ సమాయత్త పరచి చురుకుగా కార్యక్రమాలు చేయించేవారని సుశీలా నాయర్ ఒక పుస్తకంలో తెలిపారు.భారత దేశమంతా పర్యటిస్తూ  మహాత్మా గాంధీ1921లో పినాకిని సత్యాగ్రహఆశ్రమం స్థాపించిన తర్వాత 1929లో మే 11వ తేదీన కనకమ్మ గారు బాలికల పాఠశాలకు గాంధీ గారిచే  శంకుస్థాపన చేయించి కస్తూరిబా బాలికల పాఠశాల అని నామకరణం చేశారు. అదే రోజు దంపతులిద్దరూ  పల్లిపాడు,పినాకినీ సత్యాగ్రహఆశ్రమంలో ఒకరోజు రాత్రి నిద్రచేశారని, 1935లో సేవాగ్రామ్ ఆశ్రమం స్థాపించాక  ఎక్కువ కాలం అక్కడే  గడపడం జరిగింది. 1920-22 సంవత్సరాలలో సహాయ నిరాకరణ ఉద్యమం,1930-32 సంవత్సరాలలో ఉప్పు సత్యాగ్రహం,1940-42 సంవత్సరాలలో క్విట్‌ఇండియాఉద్యమాలలో పాల్గొనడమే కాకుండా ఆరు సార్లు అరెస్టై జైలులో గడిపారు.ఆగాఖాన్ ప్యాలస్ లో ఉండగా "ఏమైనా తీరని కోరిక ఉండిపోయిందా?" అని గాంధీ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ "బడికి వెళ్ళి చదువుకోవడం" తన తీరని కోరికని తెలియజేసింది. అదే తడవుగా ఆగాఖాన్ ప్యాలస్ బడిగా మారిపోయింది. భర్త గాంధీజీ ఉపాద్యాయుడు అయ్యాడు. మహదేవ్ దేశాయ్ తో కలిసి, గురువుల  సహాయంతో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించారు.
 కస్తూరిబా, మహాత్మా గాంధీ భార్య గా,గాంధీ చే ప్రభావితురాలై,భారత రాజకీయ కార్యకర్తగా, 62 ఏళ్ల పాటు అతనితో కలిసి జీవించి తన భర్త, కుమారులతో పాటు,సహచరులు సుశీల నాయర్ సరోజినీ నాయుడు, మహదేవ్ దేశాయ్ వంటి వారితో ఆమె భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది.  దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని  అనేక నిర్భంధాలను కలిసి ఎదుర్కొన్నది.  "ప్రపంచంలోని ఏ మహిళ కదిలించే లేనంతగా కస్తూరిబా నన్ను కదిలించింది"అని గాంధీజీ అన్నా "ప్రపంచంలోని ఏ స్త్రీకి నాకు ఉన్నంత ఉన్నంతటిగొప్ప భర్త లేడు"అనే కస్తూరిభా అన్నా అందుకు నిదర్శనం వారిద్దరి మధ్య బలమైన ప్రేమ బంధాన్ని తెలుపుతుంది. ఆమె భారత దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వమే పూణే లోని ఆగాఖాన్ ప్యాలస్ లో 1944 ఫిబ్రవరి 22న  గాంధీ గారు స్వయంగా నేసిన ఖద్దరు చీరను ధరించి ఆయన ఒడిలోనే కన్నుమూసింది.                                          గూడూరు లక్ష్మి                           MA(Gandhian Thoughts),(LLB)               గాంధేయవాది, సమాజ సేవకురాలు                అధ్యక్షులు: శ్రీ కళాలయ చారిటబుల్ ట్రస్ట్, పొగతోట,నెల్లూరు.9441638900,    Email: kalalayalakshmi@gmail.com