కోవిడ్19 పై పోరాటం మన అందరి బాధ్యత,

కోవిడ్19 పై పోరాటం మన అందరి బాధ్యత,
మంత్రాలయం,ఏప్రిల్,4 (అంతిమతీర్పు):-
ప్రపంచ దేశాలను వణిస్తున్న కరోనా కోవిడ్19 పై పోరాటం మన అందరి బాధ్యత అని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీపురెడ్డి  అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర నగర్ లో వైస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి, మాజీ సర్పంచ్ టి.భీమయ్య వారి ఇరువురితో కలిసి పర్యటించారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన  రేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయలు చొప్పున నగదురూపంలో లబ్దిదారులకు అందజేశారు. అనంతరం రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం అందించే చక్కెర, కందిపప్పు ప్యాకెట్లను తూకాల్ ను  పరిశీలించారు. దీంతో పాటు మండలంలోని మంచాల, చెట్నేహళి, మాధవరం, రాంపురం, రచ్చమర్రి, సుంకేశ్వరి, మాలపల్లి, వగరూరు, సూగూరు, బూదూరు, చిలకలడోణ, కల్లుదేవకుంట, కాచాపురం తదితర గ్రామాల్లో పని చేస్తున్న వాలంటీర్లకు, ఆశావర్కర్లకు మాస్క్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్ర శేఖర్, ఈవోపీఆర్డి నాగేష్, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, రాఘవేంద్ర నాయకులు జనార్దన్ రెడ్డి, మల్లికార్జున, బదరీనాథ్ శెట్టి, జయరాం, శివకుమార్, కయ్యూన్, మారెప్ప, దేవదాసు, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image