రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష

*20–04–2020*
*అమరావతి*


*రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష*


*ర్యాపిడ్‌ టెస్టు కిట్ల వ్యవహారంలో ముందుచూపుతో వ్యవహరించిన వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం అభినందనలు*


*అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*డిప్యూటీ సీఎంలు అంజాద్‌ బాషా, ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరు*


సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల కొనుగోలు వ్యవహారం


ప్రభుత్వ సొమ్మును కాపాడాలన్న ఆలోచన చేసిన వైద్య ఆరోగ్యశాఖను 
అభినందిస్తున్నా...: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌


చాలా నిజాయితీగా ఆలోచన చేసి ఆర్డర్‌ చేశారు :
మనకు కిట్లు అనేవి అవసరం, కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితి:


ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మీరు కొనుక్కోండని కేంద్రం చెప్పింది:
ఇలాంటి పరిస్థితుల్లో ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన కంపెనీకి రాష్ట్ర వైద్య  ఆరోగ్యశాఖ ఆర్డర్‌ ఇచ్చింది:


ఐసీఎంఆర్‌ రూ. 795 కు కొనుగోలుకు ఆర్డర్‌ ఇస్తే... అది తెలిసి దాన్ని కూడా రూ.65 తక్కువ రేటుకు ఏపీ ఆర్డర్‌ ప్లేస్‌ చేసింది:


ఆర్డర్‌ ప్లేస్‌ చేసినప్పుడు పర్చేజ్‌ ఆర్డర్‌లో షరతు పెట్టారు:
ఒకవేళ తక్కువ ధరకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే.. ఆ రేటు ప్రకారమే చెల్లిస్తామని ఆర్డర్‌లో స్పష్టంచేశారు:


ఇలాంటి ఆలోచన సాధారణంగా అయితే ఎవ్వరూ చేయరు:
ఒక ప్రైవేటు వ్యక్తి లేదా ఏదైనా ప్రైవేటు కంపెనీ ఏదైనా కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో అధికారులు కూడా అంతకంటే జాగ్రత్తగా వ్యవహరించడం సంతోషకరం:


గవర్నమెంటే కదా? అన్న భావన లేకుండా అత్యంత జాగ్రత్తగా నడుచుకున్నారు:


రాజీపడకుండా, అదే సమయంలో ఇక్కడి అవసరాలను గుర్తుపెట్టుకుని కిట్స్‌కు సంబంధించి వేగంగా తెప్పించుకోవడంలో ఆలస్యం లేకుండా అధికారులు తీసుకున్న చర్యలు ప్రశంసనీయం:


కిట్స్‌కు సంబంధించి  ఇప్పటివరకూ 25శాతం మాత్రమే పేమెంట్‌ఇచ్చారు:
ఇంత ఒత్తిళ్ల మధ్య మంచి ఆలోచనతో కొనుగోలు చేశారు:
అవినీతి అన్నది ఎక్కడా లేకుండా ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా అధికారులు కూడా పనిచేయడం చాలా సంతోషకరం:


మనం ఆర్డర్‌ ఇచ్చినప్పుడు ఆ కిట్స్‌ బయట దేశంలో తయారు అయ్యాయి:
ఇప్పుడు అదే కంపెనీ మన దేశంలో తయారుచేయడానికి ఐసీఎంఆర్‌ అనుమతులు ఇచ్చింది, దీనివల్ల కిట్‌ రేటు తగ్గుతుంది:


మనం పెట్టుకున్న షరతు కారణంగా ఆరేటు ప్రకారమే మనకు కూడా తగ్గబోతుంది:
దీనికి కూడా ఆ కంపెనీ అంగీకరించింది:


నేను అధికారులను అభినందిస్తున్నా :
మీరు మాకు స్వేచ్ఛ ఇచ్చారు.. దాన్ని సద్వినియోగం చేసుకుని రాజీపడకుండా అడుగులు ముందుకేస్తున్నామన్న అధికారులు


*రెడ్‌జోన్లలో ప్రజలకు అందుబాటులోకి నిత్యావసరాలు:*


రెడ్‌జోన్లలో ఉన్న ప్రజలకు మరింత అందుబాటులోకి నిత్యావసరాలు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. 


డోర్‌ డెలివరీ లాంటి విధానాలతోపాటు మార్కెట్లను మరింత వికేంద్రీకరించి వారికి నిత్యావసరాలు అందేలా చూడాలన్నారు.


కరోనా లాంటి వైరస్‌ను ఎదుర్కోవాలంటే పౌష్టికాహారం కూడా చాలా అవసరమని, అందుకనే పండ్లు, కూరగాయలు విరివిగా లభ్యం అయ్యేలా చూడాలన్నారు. 


కర్నూలులో రూ.100 కే పండ్లు అందిస్తున్న వ్యూహాన్ని మిగతాచోట్ల కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ప్రజలకు పౌష్టికాహారం అందుతుందని చెప్పారు. 


*అసోంలో తెరుచుకుంటున్న చేపల మార్కెట్లు:*


– అసోం ముఖ్యమంత్రితో సీఎం ఫోన్‌ సంభాషణల వల్ల ఆక్వారైతులకు సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చిన అధికారులు


– అక్కడ చేపల విక్రయానికి సంబంధించిన మార్కెట్లు తెరుచుకుంటున్నాయని, అసోం సీఎం సోనోవాల్‌ అధికారులతో సమీక్షించి మార్కెట్లు తెరిచేందుకు యత్నిస్తున్నారని, దీనివల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని సీఎంకు అధికారులు నివేదించారు. 


– ఈ తరహా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు.


– అలాగే అరటికి సంబంధించి కూడా సానుకూల పరిస్థితులు వస్తున్నాయని, కొన్నిచోట్ల రేట్లు కూడా పెరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నిరంతరంగా పర్యవేక్షణ, సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. రైతుకు మేలు జరిగే ఏ అవకాశాన్నీ కూడా వదులకోవద్దని స్పష్టంచేశారు. 


– మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించిన సీఎం


– గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా వివరాలు తెప్పించుకుని దీనిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయాలన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాని సీఎం ఆదేశించారు.