కేంద్ర ప్రభుత్వం 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది - బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు

కోవిడ్ - 19 భాగంగా కేంద్ర ప్రభుత్వం 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది - బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు


అమరావతి, 10 ఏప్రిల్ : 


కోవిడ్‌ -19 గురించి విలేకరుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూప రాణి, బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావులు పాల్గొన్నారు.
ఈ సందర్భముగా స్వరూప రాణి మాట్లాడుతూ కోవిడ్‌ -19  భాగంగా DRDO దేశ వ్యాప్తముగా పంచిన మెడికల్ కిట్లలో భారీగా అవినీతి జరిగిందని, దేశ వ్యాప్తముగా పంచిన మెడికల్ కిట్లలో
భాగంగా ఆంధ్రప్రదేశ్ కి 1000 కిట్లను సరఫరా చేసిందని,  మరియు AMTZ వైజాగ్ (మెడ్ టెక్ పార్క్) లో తయారు చేసినట్లుగా లేబుల్ చేయబడిందని తెలిపారు.
పాత, కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే భాటలో నడుస్తున్నాయనడానికి ఇదో నిదర్శనమన్నారు. ఇది అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడం అని అన్నారు.
స్థానిక పత్రికా ప్రతినిధులు మరియు స్థానిక బిజెపి ఎమ్మెల్సీ పి.వి.యన్. మాధవ్ తో ఒక ప్రతినిధి బృందాన్ని పంపి, కిట్లు మరియు వెంటిలేటర్ల తయారు  చేసే యూనిట్ ను చూడటానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ రాహత్ భార్గవ్ వైజాగ్ కలెక్టర్ యోని యూనిట్లను సందర్శించాలని ఆదేశిస్తే, అప్పుడు లూబన్ యూనిట్‌ను సందర్శించవద్దని కలెక్టర్‌ను కోరారన్నారు. దీని పై వెంటనే హై పవర్ కమిటీ వేయాలని కోరారు.


బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు మాట్లాడుతూ కోవిడ్ - 19 భాగంగా కేంద్ర ప్రభుత్వం 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ఈ పధకాన్ని  రాష్ట్రంలో ఉన్న లబ్దిదారులు ఉపయోగించుకోవచ్చన్నారు.
కానీ, దురదృష్టవశాత్తు ఉజ్జ్వాలా గ్యాస్ కనెక్షన్ కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ కనెక్షన్  ఇవ్వవలసి ఉండగా, అప్పుడు  చంద్రబాబు నాయుడు గారు అదే గ్యాస్ కనెక్షన్‌ను దీపం పథకం కింద మార్చిఇచ్చారని,  అప్పుడు రాష్ట్ర ఖజానాకు కొన్ని వందల కోట్ల రూపాయలు భారం పడిందని తెలిపారు.
దేశంలోని మిగిలిన ప్రాంతాలు ఉజ్జ్వాలా గ్యాస్ పథకాన్ని ఉపయోగించుకున్నాయని తెలియజేశారు. ఇప్పుడు భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉజ్జ్వాలా కనెక్షన్ ఉన్నవారు మాత్రమే ఈ ఉచిత గ్యాస్ పధకం కోసం అర్హులు అని సుబ్బారావు ఈ సందర్భంగా తెలిపారు. అందువల్ల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం  వలన రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడటమే కాకుండా అసలైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కొక్క గ్యాస్ డీలర్‌ దగ్గర ఉజ్జ్వాలా కింద కేవలం పదుల సంఖ్యలో కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని అదే  దీపం పధకం క్రింద ఇచ్చిన కనెక్షన్లు వేల సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అసలైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పొందే అవకాశాన్ని కల్పించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు కోరారు.