మే 3 వరకు ఈ పాస్ గడుపు పెంపు: రాష్ట్ర కరోనా కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి హిమాన్హు శుక్లా

మే 3 వరకు ఈ పాస్ గడుపు పెంపు:
రాష్ట్ర కరోనా కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి హిమాన్హు శుక్లా


       విజయవాడ,ఏప్రిల్,14 (అంతిమ తీర్పు):                  ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తూ అత్యవసర సేవలలో పాలు పంచుకుంటున్న ఉద్యోగులకు జారీ చేసిన ఈ పాస్ ల గడువు మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కరోనా కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి, చేనేత జౌళి శాఖ కమీషనర్ హిహాన్హు శుక్లా తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్దితిలో  ప్రైవేట్ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకునే క్రమంలో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ పాస్ గడువు ఏప్రిల్ 14 తేదీతో ముగిసినప్పటికీ అవి యధాతధంగా మే 3వ తేదీ వరకు చెల్లుబాటు కానున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 13000 ఈ పాస్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయగా, పాస్ పొందిన వారు ఎటువంటి ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వాటిని పొడిగించామన్నారు.  ఇప్పటికే పాస్ పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని, అవి స్వయం చాలితంగా అమలులోకి వస్తాయని హిమాన్హు శుక్లా స్పష్టం చేసారు.  ప్రధాని లాక్ డౌన్ కాలాన్ని మరో 19 రోజులు పొడిగించిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, నూతనంగా పాస్ జారీ కూడా యధాతధంగా కొనసాగుతుందని శుక్లా పేర్కొన్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ మరికొంత కాలం కొనసాగనుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్ ను మంజూరు చేస్తోంది.


 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదేశాలు మేరకు అధికారులు ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసం జారీ చేస్తున్నారు.  వ్యవసాయ, సహకార (MKTG II) విభాగం 26.03.2020 తేదీన జారీ చేసిన జిఓ ఆర్ టి నెంబర్ 289 లో జాబితా చేర్చబడిన వస్తు సేవల ఉత్పత్తి,  సరఫరాలో నిమగ్నమై ఉన్న వారందరికీ ఈ పాస్ మంజూరు చేసారు. సంస్థ యజమాని తనతో సహా ఇరవై శాతం ఉద్యోగులకు కనిష్టంగా 5, గరిష్టంగా ఇ-పాస్ జారీ నిబంధనలు,  షరతులకు లోబడి మంజూరు చేస్తున్నామని హిమాన్హు శుక్లా తెలిపారు. పాస్ పొందేందుకు  ఎవ్వరూ కార్యాలయాలకు రానవసరం లేదని  https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration పై క్లిక్ చేయడం ద్వారా కొత్తగా పాస్ కావలసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  స్పందన పోర్టల్ వెబ్‌లింక్ (www.spandana.ap.gov.in/) ద్వారా  కూడా పాస్ పొందగలుగుతారని వివరించారు.


 నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్ ను ప్రత్యేక  QR కోడ్‌తో SMS ద్వారా ఉద్యోగి మొబైల్ నంబర్ కు పంపుతున్నామని,  వెబ్-లింక్ క్లిక్ చేసినప్పుడు QR కోడ్‌తో సహా పాస్ కనిపిస్తుందని లాక్ డౌన్ పెరిగిన నేపధ్యంలో కాలపరిమతి సైతం ఆటోమెటిక్ గా మారుతుందన్నారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్ రీడర్ అందించగా,  తద్వారా పోలీసు అనుమతి మేరకు పాస్ వినియోగించుకుంటున్నారన్నారు.  భధ్రతా ప్రమాణాల పరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్న హిమాన్హు శుక్లా ఈ పాస్ కు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉందని,  చెక్ పోస్టులలోని పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటమే కాక,  అత్యవసర పాస్ యొక్క నిజాయితీని ధృవీకరించడానికి మొబైల్ అనువర్తనానికి అనుగుణమైన మెకానిజం ఉందని  శుక్లా వివరించారు.  ఎలాంటి ఫోర్జరీ, దుర్వినియోగంకు అవకాశం లేదన్నారు. పాస్ కోసం దరఖాస్తు చేసిన వారు  తమ ఇబ్బందులను నమోదు చేసుకోవడానికి 1902కు పిర్యాధు చేస్తే అవి అయా జిల్లాల జాయింట్ కలెక్టర్‌ల దృష్టికి వెళతాయన్నారు.


 


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం