గ్రామీణ ప్రాంత ప్రజలకు అండగా చేగువేర ఫౌండేషన్

*గ్రామీణ ప్రాంత ప్రజలకు అండగా చేగువేర ఫౌండేషన్



          గుడూరు :     ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ .2000 కుటుంభాలకు చేయూత అంధిస్తాం...చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్ఆర్ కాంగ్రేస్ యువ నేత మండ్ల సురేష్ బాబు.ముఖ్య అతిధి గా గుడూరు తహశీల్దార్ లీలారాణి  



*కోవిడ్-19 కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యం తో చేగువేర ఫౌండేషన్ నిరాశ్రయులకు,పేద ప్రజలకు అండగా ఉండి అందుకోవడం జరుతుందని చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్ఆర్ కాంగ్రెస్స్ యువ నేత మండ్ల సురేష్ బాబు అన్నారు.లాక్ డౌన్ విధించిన నాటి నుంచి చేగువేర ఫౌండేషన్ ప్రభుత్వ ఆశ్రయ కేంద్రాల్లో ఉన్న వలస కూలీలకు, పట్టణ శివారులలో ఉన్న పేదలకు ఆహారం అందిస్తోంది. మరో పక్క పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం పట్టణ పురవీధులలో క్లోరినేషన్, శానిటేషన్ చేయడం జరిగింది.సేవ కార్యక్రమాల్లో భాగంగా గూడూరు గ్రామీణ ప్రాంతాల్లో శనివారం (18/04/2020)నుంచి ఈదలపల్లి,పగడాలపల్లి గ్రామాల్లో తహసిల్దార్ లీలరాణి ఆదేశాలతో ప్రజలకు ఇంటింటి వెళ్లి నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది.గూడూరు *హొండ్ షోరూం అధినేత కె.సురేష్ కుమార్ రెడ్డి*  *దాన్‌ ఫౌండేషన్‌ గుడూరు వారు మరియుచేగువేర పైలట్ టీమ్ సభ్యుల దాతృత్వంతో ఒక్కొక్క కుటంభానికి 5కేజీల బియ్యం,మూడు కేజీల కూరగాయలు,500ఎం.ఎల్ నూనె,500గ్రా కందిపప్పు,పసుపు,సాల్ట్,500గ్రా పెసర పప్పును 100 కుటుంబాలకు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా తహసీల్దార్ లీలరాణి హాజరై  నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజా సేవే లక్ష్యంగా చేగువేర ఫౌండేషన్ పనిచేయడం మంచి పరిణామం అన్నారు.ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ చేగువేర ఫౌండేషన్ ప్రజల మన్ననలు పొందడం జరిగిందన్నారు.చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్ఆర్ కాంగ్రెస్స్ యువనేత మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో 2000మంది నిరుపేద ప్రజానీకానికి తమ వంతు సాయంగా నిత్యవసర సరుకులను అందిస్తున్నామన్నారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరించి ఇంటి నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరారు.కోవిడ్-19ను సమర్ధవంతంగా పరిశుభ్రతా,సామాజిక దూరం పాటించి ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.అనంతరం గ్రామ రెవెన్యూ అధికారి పుల్లయ్య,గ్రామ కార్యదర్శి నిశాంతిల పర్యవేక్షణలో చేగువేర పైలట్ టీమ్ సభ్యులు ఇంటింటికి వెళ్లి నిత్యవసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేగువేర ఫౌండేషన్ అధ్యక్షులు అన్సర్ భాష,ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్,,మధు రెడ్డి,వినోద్ పవన్‌ మౌనేష్‌ మరియు దాన్‌ ఫౌండేషన్‌ అధ్య కులు వెంకచేష్‌   శ్రీకాంత్‌రెడ్డి, రాజ్యవర్ధన్  రెడ్డి తదితరులు పాల్గొన్నారు.