*ఇప్పటి వరకు 391 శ్యాంపిల్స్ సేకరణ. : చిత్తూరు జిల్లా కలెక్టర్ 


💐 *కుల, మతాలకతీతంగా కరోనా కట్టడికి సహకరించండి* 
💐 *నిత్యం శ్యాంపిల్ ల సేకరణ* 
💐 *అందరి సమిష్టి కృషితో ముందుకు . . .*  
💐 *సమర్థవంతంగా కరోనా ను నియంత్రిద్దాం* 
💐 *ఇప్పటి వరకు 391 శ్యాంపిల్స్ సేకరణ* 
 *: జిల్లా కలెక్టర్*  
 *చిత్తూరు, మార్చి 7:* ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న చాలా కీలక సమయం . . కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలందరూ సహకరించాలి. వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా నోడల్ అధికారి మరియు జెసి2 చంద్రమౌళి, డిఎం అండ్ హెచ్ ఓ డా.పెంచులయ్యతో కలసి జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందని, ఇందులో 14 కేసులు ఢిల్లీ మర్కజ్ మసీదు జమాత్ తో సంబంధం కలిగిన వారని, ఒక కేసు విదేశాల నుండి వచ్చిన వారని మరియు 2 కేసుల్లో వీరికి ట్రావెల్ హిస్టరి ఉన్నదని వీరు తిరుపతికి సంబంధించిన వారని తెలిపారు. జిల్లాలో మొత్తం 391 శ్యాంపిల్స్ సేకరించగా నిన్నటి వరకు 323 ఫలితాలు రాగా ఉదయం 40 శ్యాంపిల్స్ పరీక్ష చేయగా నెగెటివ్ రావడం జరిగిందని మొత్తం దాదాపుగా 360 శ్యాంపిల్స్ నెగెటివ్ జరిగిందని తెలిపారు. 65 సంవత్సరాలు పైబడి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లైతే వారందరికీ శ్యాంపిల్స్ సేకరణ చేయడం జరుగుతున్నదని, ముందస్తు జాగ్రతల్లో భాగంగా రోజుకు నియోజకవర్గాల పి.హెచ్.సి ల  వారీగా 100 శ్యాంపిల్స్ సేకరణ చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో గల 20  ట్రూ నాట్ మెషిన్ల ను వినియోగించి ప్రాథమికంగా టెస్ట్ చేసిన యెడల పాజిటివ్ వస్తే మరళా తిరుపతిలో టెస్ట్ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఫారిన్ రిటర్న్స్, డిల్లీ జమాత్ రిటర్న్స్ అందరినీ గుర్తించడం జరిగిందని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి ఒక్కొక్కరికీ విడివిడిగా మరుగుదొడ్లు లేకపోవడంతో కలికిరి జె ఎన్ టి యు, పలమనేరు మదర్ థెరీశా కాలేజీ లను ఖాళీ చేసి అక్కడ ఉన్న వారిని తరలించడం జరిగిందని తెలిపారు. స్వాప్ టెస్టింగ్ తిరుపతితో పాటు చిత్తూరు, పీలేరు, పలమనేరు లో కూడా చేయడం జరుగుతున్నదని తెలిపారు.   
 కాణిపాకంలోని క్వారంటైన్ సెంటర్ కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అసంబద్ధమైనదని, నిజానికి దూరంగా కలదని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లుగా కళ్యాణ మండపాలను, స్కూల్ లను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వివరిస్తూ క్వారంటైన్ సెంటర్లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని 14 రోజుల పాటు ఉంచడం జరుగుతుందని, 14 రోజుల తరువాత పరీక్షల చేసినట్లైతే వారికి పాజిటివ్ లేదా నెగెటివ్ రిపోర్ట్ తేలుతుంది కాబట్టి ఈ సమయంలో కూడా వారిని విడివిడిగా ఉంచడం జరుగుతుందని, ఇందులో భాగంగానే కాణిపాకం దేవస్థానంకు 400 మీటర్ల దూరంలో గల గణేశ్ సదన్ ను క్వారంటైన్ సెంటర్ గా ఎంచుకోవడం జరిగిందని ఇందులో 86 రూములు కలవని తెలిపారు. ఐసొలేషన్ వార్డు అనగా పాజిటివ్ వచ్చిన వారందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఐరాల తహశీల్దార్, కాణిపాకం ఇఓ వారు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో గురించి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అన్నీ మతాల నమ్మకాలను విశ్వసించడం జరుగుతుందని, మతాల నమ్మకాలను వమ్ము చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కాణిపాకం గణేశ్ సదన్ తో పాటు శ్రీకాళహస్తిలో గల దేవస్థానం గదులను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు.
 టిటిడి వారు ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నదానం చేస్తున్నారని, స్విమ్స్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ గా ఉన్నందున టిటిడి వారు రూ.19 కోట్లు మంజూరు చేసి అత్యవసరంగా అవసరమైన పరికరాల కొనుగులుకు వినియోగించాల్సిందిగా తెలుపడమైనదని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరం కలసి కట్టుగా పని చేసి కుల, మతాలకతీతంగా పని చేయాలని తెలిపారు. దేవస్థానం, చర్చ్, మసీదుల పవిత్రతలను కాపాడతామని తెలిపారు. 
 ఈ విలేకరుల సమావేశం లో భాగంగా విలేకరులకు స్యానిటైజర్లు, మాస్క్ లను జిల్లా కలెక్టర్, జెసి 2 పంపిణీ చేశారు.