ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో 400 నాన్ ఐ సి యు బెడ్లు, 60 ఐ సి యు బెడ్లు అందుబాటు :కలెక్టర్ ఐ శామ్యూల్  ఆనంద్ కుమార్  


గుంటూరు, ఏప్రిల్ 12-2020:-  కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వ్యక్తులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాల ఆసుపత్రిని జిల్లా కోవిడ్  ఆసుపత్రిగా మార్చి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్  ఆనంద్ కుమార్  పేర్కొన్నారు. 


  ఆదివారం మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాల ఆసుపత్రిని, కోవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్ తో కలసి జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్  ఆనంద్ కుమార్  పరిశీలించారు.  ఆసుపత్రిలోని కోవిడ్ -19 పాజిటివ్ వ్యక్తులకు చికిత్స కోసం  కేటాయించిన గదులను, పిపిఈ కిట్లను పరిశీలించారు.  ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం గురించి  ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మస్తాన్ సాహెబ్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.  ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న వారికి కల్పిస్తున్న సౌకర్యాలను తెలియజేశారు. పాజిటివ్ వ్యక్తులు ఆసుపత్రిలో రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు.  కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు వైద్య చికిత్స అందించాలని, తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారిని విజయవాడలోని స్టేట్ కోవిడ్ -19 ఆసుపత్రికి తరలించాలన్నారు.  ఆసుపత్రిలో వున్న వారికి డైటీషియన్ సూచనల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహరం అందివ్వాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో వున్న వసతులను పరిశీలించి వైద్య అధికారులతో చర్చించామన్నారు. ఎన్ ఆర్ ఐ ఆసుపత్రిలో 400 నాన్ ఐ సి యు బెడ్లు, 60 ఐ సి యు బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.  ఆసుపత్రిలో చికిత్స అందించే వారికి అవసరమైన క్వాలిటీ పిపిఈ కిట్లు అందించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్ ఆర్ ఐ  తో పాటు, కె యం సి ఆసుపత్రి,  ఐ డి హెచ్ గుంటూరు, జిల్లా ఆసుపత్రి తెనాలి, మణిపాల్, లలితా సూపర్ స్పెషాలిటి కోవిడ్ ఆసుపత్రులుగా గుర్తించి  అవసరమైన సిబ్బందిని ఎక్విప్మెంట్ ను సిద్దంగా వుంచామన్నారు.   క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాలు 5000 సింగల్ రూమ్ అటాచ్ద్ బాత్ రూమ్ తో ఏర్పాటు చేసామని, వీటిలో 1100 మంది వరకు ఉన్నారన్నారు.  కరోనా వైరస్ పై ఆందోళన చెందకుండా ప్రజల్లో భరోసా నింపేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు.  ప్రజలు ఇళ్ళలోనే వుండి సామాజిక దూరం పాటిస్తూ, ఆరోగ్యపరమైన అలవాట్లు, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం వలన కరోనా వైరస్ వ్యాప్తి జరుగకుండా నిరోధించవచ్చన్నారు.


  కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి, స్పెషల్ కలెక్టర్ బాబురావు, ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image