ఏపీలో ఇప్పటి వరకు 48 వేల టెస్టులు చేశాం : జవహర్‌రెడ్డి
అమరావతి : ఏపీలో ఇప్పటి వరకు 48 వేల టెస్టులు చేశామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి 10 లక్షల జనాభాకు 961 పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ టెస్టులు సరిగా చేయడం లేదనడం సరికాదన్నారు. కేసులను దాస్తున్నామనడంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. నిజంగా కేసులను దాస్తే ఆ వ్యక్తి వల్ల ఎందరో ఎఫెక్ట్ అవుతారని చెప్పారు. ఎవరైనా వీఐపీని గుర్తించకపోతే ఆయన సూపర్ స్ప్రెడర్‌గా మారుతాడని చెప్పారు. కర్నూలు ఆస్పత్రిని కూడా కరోనా ఆస్పత్రిగా మారుస్తున్నామని ఆయన ప్రకటించారు. 3 లక్షల పీపీఈ కిట్లు, 45లక్షల మాస్క్‌లు, 31లక్షల గ్లౌజ్‌లు ఉన్నాయని, క్వారంటైన్ 14 రోజులా..28 రోజులా అనేది చూడాలని అధికారులకు సూచించారు. కొన్ని కేసుల్లో 14 రోజుల్లో తర్వాత కూడా పాజిటివ్ వస్తోందని జవహర్‌రెడ్డి చెప్పారు.
ఏపీలో ఇప్పటి వరకు 48 వేల టెస్టులు చేశాం : జవహర్‌రెడ్డి