శ్రీకాళహస్తి ఘటనతో జిల్లాలో అప్రమత్తం అవసరం


శ్రీకాళహస్తి ఘటనతో జిల్లాలో అప్రమత్తం అవసరం


ఈనెల 20 నుండి కేంద్ర, రాష్ట్ర, జిల్లా సూచనలు తప్పనిసరి అమలు కావాలి  – పరిశీలకులు సిసోడియా 


తిరుపతి, ఏప్రిల్ 19: శ్రీకాళహస్తి ఘటనతో అప్రమత్తం అవసరం, ఈ నెల 20 నుండి కొన్ని లాక్ డౌన్ రిలాక్సేషన్స్ కేంద్ర, రాష్ట్ర, జిల్లా సూచనలు తప్పనిసరి అమలు కావాలని కోవిడ్ 19 పరిశీలకులు సీనియర్ ఐ ఏ ఎస్ ఆర్.పి.సిసోడియా ఆదేశించించారు. ఆదివారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిశీలకులు జిల్లా అధికారులతో కోవిడ్ టాక్స్ ఫోర్స్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పరిశీలకులు వివరిస్తూ శ్రీకాళహస్తి ఘటన చూస్తే అన్ని ఏర్పాట్లు చేస్తున్నా , ఎలా వచ్చిందనే సమస్య ఎదురైంది, అందులో విధుల్లో వున్న సిబ్బందికి, అధికారులకు పాజిటివ్  రావడం దురదృష్టకరం ఇకపై ప్రతి అధికారి కోవిడ్ విధుల్లో వున్నవారు తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రజలు అర్థంచేసుకోవాలి అగ్రరాజ్యం అమెరికాలో నేడు ఒక్కరోజు 4500 చనిపోయారంటే ఎలా వుంటుందో వూహించని విధంగా వుంది అన్నారు. సామాజిక దూరం తప్పని సారి పాటించాలి ,అత్వసరపరిస్థిలలో, మెడికల్ సంబందం తప్ప ఒక మండలం నుండి మరొక మండలం గానీ , జిల్లా గానీ రాష్ట్రం గానీ దాటడానికి వీలులేదు. రెడ్ జోన్ మండలాల్లో పరిశ్రమలు , ఏ ఇతర షాపులు తెరుచుకోరాదు. టాక్సీలు, స్కూలు బస్సులు , ఆటోలు తిరగడానికి వీలుండదు, బ్యాంక్స్ కార్యకలాపాలు , కిరాణా షాపులు , నిత్యవసర వ్స్తువులు , మెడికల్ దుకాణాలు వద్ద తప్పనిసరి సానిటైజర్ తో చేతులు శుబ్రపరచుకున్న తరువాత కొనుగోలుకు అనుమతి వుండాలి,  హోటల్స్, డాబాలు పనిచేయయ్నున్నాయి , హోటల్స్ లో ఎవరైనా బస చేస్తే వారి పూర్తి వివరాలు , ఎందుకు వచ్చారో తెలపాలి ఆ జాబితా రెవెన్యూ డివిజనల్ అధికారులు, సబ్ కలెక్టర్లు మానిటర్  చేయాల్సి వుంటుంది. పరిశ్రమలలో పనిచేయదలచుకున్న వారు ఆయా మండలంలో వున్నవారికే అనుమతి,  ప్రక్క మండలం వారికి కూడా అనుమతి లేదు. ప్రభుత్వ సిబ్బంది కూడా నివాస మండలం దాటి వెళ్లకూడదు.  పరిశ్రమల వారు బస్సులు నడిపితే అందులో 30 శాతం మాత్రమే ప్రయాణించాలి. రెడ్ జోన్ లో వారు బయటకు రాకూడదు. చాలామంది వాకింగ్ చేస్తున్నారు లాక్ డౌన్ వరకు అనుమతి లేదు. ఎన్ సి సి , ఎన్ జి ఓ వ్యవస్థ సేవలు వుపయోగించండి. మతపరమైన  పార్థనలు ఇంటివద్దే జరుపుకోవాలి, రానున్న 24 నుండి నుండి రంజాన్ మాసం లో అందరూ  ఇంటికే పరిమితం కావాలి. ఈ సమయంలో మటన్ , చికెన్ షాపులు అభ్యర్థన వస్తే పశు సంవర్థక శాఖ పుడ్ ఇన్సిపెక్టర్లు పర్వవేక్షణలో  అధికారుల పర్యవేక్షలో జరిగాలని ఆదేశించారు. రిలీఫ్ సెంటర్లో వున్న బయటి వ్యక్తులకు వసతులు లాక్ డౌన్ వరకు కల్పించాలి బయట వెళ్లడానికి వీలుండదు అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక కమిషనర్ గిరిషా, జెసి మార్కండేయులు, మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి , జెసి 2 చంద్రమౌళి , అడిషనల్ ఎస్.పి. సుప్రజ , విమానాశ్రయ ఎపిడి సురేష్, రుయా సూపర్నెట్ ఎన్ వి రమణయ్య, నోడల్ అధికారి చంద్రశేఖర్ , పిడి లు మురళి, జ్యోతి , జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
-- డిి


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image