సింహపురి రెడ్డి సంక్షేమసంఘం వారి దాతృత్వం,గూడూరు మున్సిపాలిటీకి 50,000 వితరణ

*సింహపురి రెడ్డి సంక్షేమసంఘం వారి దాతృత్వం,గూడూరు మున్సిపాలిటీకి 50,000 వితరణ


గూడూరు   ,ఏప్రిల్,10 (అంతిమ తీర్పు) :                 మున్సిపల్ పరిధిలో ఉన్న అర్హులైన పేదలందరినీ ఆదుకుంటాం కమిషనర్ ఓబులేసు అన్నారు. ఈ రోజు సింహపురి రెడ్డి సంక్షేమసంఘం సభ్యులు గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు కు మున్సిపల్ సహాయ నిధికి 50,000 రూ లను అందచేశారు..రెడ్డి సంక్షేమసంగం  అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మరి వల్ల ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం తో మున్సిపల్ పరిధిలో కూలీ పనులు చేసుకునే ఎంతో మంది పేదలు ఇళ్లకే పరిమితం కావడం తో వారికి ఆహార కోరత ఏర్పడిందని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ రెడ్డిసంఘం ద్వారా చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ ఓబులేసు కి 50,000 రూ అందించడం జరిగింది అన్నారు,


కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా మున్సిపల్  ఎంతోమంది ఆకలితో ఉన్నారని,అన్నీ అనుకున్న ట్టు జరిగి ఉంటే ఏప్రిల్ నాటికి కొత్త రేషన్ కార్డులు వచ్చేవని కానీ ఈ కరోనా వల్ల కొత్త కార్డులు ఆగిపోవడంతో చాలా మందికి అర్హత వున్నా ప్రభుత్వ పదకాలు చేరడం లేదని అలాంటి వారికి,శానిటేషన్ లో వుండే నిరుపేదల సిబ్బందికి ఈ సహాయ నిధికి వచ్చే డబ్బులు ఉపయోగిస్తామని తెలియచేసారు..
    
ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మార్వో లీలారాణి,వైసీపీ గూడూరు మం,రూరల్ కన్వీనర్ మల్లువిజయ్ కుమార్ రెడ్డి,రెడ్డిసంఘం సభ్యులు ఉపాధ్యక్షుడు దశరథరామి రెడ్డి,బి.సుబారెడ్డి,dr రోహినమ్మ,జనార్దన్ రెడ్డి,సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు...


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు