కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 5000 వేలు ఇవ్వాలి. ఎమ్మెల్సీ *యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్*
ఉయ్యురు. ఏప్రిల్ 9 :(అంతిమ తీర్పు): నగర పంచాయతీ 10 వార్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పలియాల శ్రీను పర్యవేక్షణలో 600 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్*
ఈ సందర్బంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తుంది అని అందరూ ఇంటి దగ్గరే ఉండి లాక్ డౌన్ పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని,ఇలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో 10వార్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ ముందుకువచ్చి కూరగాయలు పంచినందుకు వాళ్ళను అభినందిస్తున్నానని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూనపరెడ్డి వాసు, కరణం శ్రీనాధ్, ఆకుల సత్యం, V.జనార్దన్, R.శ్రీను, 10 వార్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.