వింజమూరులో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు:  యం.పి.డి.ఓ కనక దుర్గా భవాని

వింజమూరులో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు:  యం.పి.డి.ఓ కనక దుర్గా భవాని


: వింజమూరు, ఏప్రిల్ 12 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో ఈ వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సమృద్ధిగా నీటిని అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకధుర్గా భవానీ పేర్కొన్నారు. ఇందుకు గానూ ఆమె గత వారం రోజుల నుండి పంచాయితీ పరిధిలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు, మినీ రక్షిత మంచినీటి పధకాలను పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో పరిశీలిస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో పంచాయితీ సిబ్బందిని అప్రమత్తం చేసి ఓవర్ హెడ్ ట్యాంకులలో క్లోరినేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. అందుకు అవసరమైన బ్లీచింగ్ ను ఇప్పటికే పెద్ద మొత్తంలో మండల పరిషత్ కార్యాలయంలో సిద్ధం చేసి ఉన్నారు. సాక్షాత్తూ యం.పి.డి.ఓ తరలి పంచాయితీ కార్యదర్శిని వెంటబెట్టుకుని క్షేత్ర స్థాయిలో తాగునీటి పధకాల వద్దకు వెళుతుండటంతో ఆయా శాఖలకు చెందిన సిబ్బంది సైతం పరుగులు పెడుతున్నారు. 20,639 మంది జనాభా కలిగిన వింజమూరు మేజర్ పంచాయితీ పరిధిలోని పలు ప్రాంతాలలో దాదాపుగా 100కు పైగా మినీ రక్షిత మంచినీటి పధకాలు (డైరెక్ట్ పంపింగ్ స్కీములు), 20 వేల నుండి 45 వేల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన 8 ఓవర్ హెడ్ ట్యాంకులు నీటి అవసరాల నిమిత్తం పని చేస్తుండగా వాటిలో కొన్ని చిన్న చిన్న మరమ్మత్తులతో మొండికేస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పడు వస్తారో తెలియని పరిస్థితులు వింజమూరులో సర్వ సాధారణమైపోయాయి. ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించిన సంధర్భాలలో మాత్రమే తళుక్కుమంటూ తరువాత
 ముఖం చాటేస్తున్నారనే విమర్శలున్నాయి. గత వేసవిలో వింజమూరు ప్రజలు తాగునీటి కోసం భగీరధ ప్రయత్నాలు చేసి ఏకంగా రిలే నిరాహార దీక్షలకు దిగారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో నూతనంగా భాధ్యతలు చేపట్టిన యం.పి.డి.ఓ తనదైన శైలిలో ఇప్పటికే ప్రజల తాగునీటి అవసరాలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకుని నిత్యం ఏదో ఒక ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న కనకదుర్గా భవానీ ఇప్పటికే తమ స్వీయ పర్యవేక్షణలో ఉన్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను అప్రమత్తం చేస్తూ ఆయా గ్రామల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image