ఎస్టీయూ స్వచ్ఛంద సేవలు అభినందనీయం.
వెంకటగిరి : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏర్పడిన ఘోరమైన విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులతోపాటు సాధారణ ప్రజలు కూడా కాలు బయట పెట్టడానికి గడగడలాడుతున్న పరిస్థితుల్లో కూడా వెంకటగిరి ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని ఎస్టీయూ ఉపాద్యాయ సంఘానికి చెందిన ఉపాద్యాయులు తమ సామాజిక భాద్యతగా భావించి గత పధ్నాలుగు రోజులుగా స్థానిక విశ్వోదయ కళాశాల ఆవరణలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సామాజిక దూరం పాటించేలా క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ, పార్కింగ్ ను నియంత్రిస్తూ అంకిత భావంతో విధులు నిర్వహిస్తుండటం పట్ల మండల స్థాయి అధికారులతోపాటు అనేక మంది ప్రజలు కూడా వారి సేవలను అభినందిస్తున్నారు. ఈసందర్భంగా ఎస్టీయూ జిల్లా అద్యక్షులు తాళ్ళూరు. శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఈ కరోనా విధులు తమకు తప్పనిసరి కాకపోయినా వెంకటగిరి ప్రజలకు కరోనా సోకకుండా చూడటానికి,ప్రజలకు అవగాహన కల్పించాలని,అధికారులకు చేదోడుగా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో తాము కూడా ప్రాణాలకు తెగించి ఈవిధులు నిర్వహిస్తున్నామనీ,కావున అత్యవసరమైన పనులు మీద మాత్రమే ప్రజలు బయటకు రావాలని,అవసరం లేకపోయినా రోడ్ల మీదకు రాకూడదని,సామాజిక దూరం పాటించాలని,గుంపులు గుంపులుగా చేరకూడదనీ, అందరూ మాస్కులు ధరించాలనీ,వ్యక్తిగత శుభ్రత పాటించాలనీ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ తెలిపారు.ఈ కార్యక్రమంలోవై.రామమోహన్ రెడ్డి,ఎస్.కె.మస్తాన్,ఎ.సుబ్రహ్మణ్యం,బి.కోటేశ్వరరావు,పివి.శివకుమార్,ఆర్.సాంబశివరావు, వి.సురేష్,వి.రమేష్,టివిఎస్. దాసు,సీహెచ్.కృష్ణయ్య,కె.రమేష్ బాబు,సీహెచ్. సర్వేశ్వరరావు,యం.శ్రీనివాసులు, జీఎస్. రెడ్డి పాల్గొన్నారు.