అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై  67 కేసులు నమోదు

 


విజయవాడ/ 10 -04-2020


లాక్ డౌన్ నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 691 తనిఖీలు  నిర్వహించి, నిత్యావసర వస్తువుల ధరలను సంబంధిత జిల్లాల కలెక్టర్లు నిర్ధారించి ధరల కంటే  అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై  67 కేసులు నమోదు చేయడమైనది.


నిత్యావసర వస్తువుల యొక్క ధరలు నిర్ధారిత ధరల కంటే అధిక ధరకు విక్రయించిన ఎడల లేదా తూనికలు కొలతలలో మోసపోయినట్లు భావించిన ఎడల లేదా ప్యాకేజీలపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల కన్నా అధిక దలకు విక్రయం చేసిన ఎడల లీగల్ మెట్రాలజీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1800 - 425 - 4202 కు ఫిర్యాదు చేయగలరు.