రైతు ఏడ్చిన రాజ్యం, మహిళ కన్నీళ్లు పెట్టిన ప్రాంతం ఎప్పుడూ బాగు పడలేదు.:కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినెషన్ కమిటీ మెంబెర్ సుంకర పద్మశ్రీ

 


ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినెషన్ కమిటీ మెంబెర్ సుంకర పద్మశ్రీ ఫైర్


విజయవాడ,ఏప్రిల్ 26 (అంతిమ తీర్పు) :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా అక్కా చెల్లెళ్లను మోసం చేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో కానీ వైసీపీ మేనిఫెస్టో లో గాని రాష్ట్ర వ్యాప్తంగా అప్పటివరకు పెండింగ్లో ఉన్న డ్వాక్రా సంఘాల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.  వాస్తవంగా ఈ సున్నా వడ్డీ అనే పథకం కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైంది. 
 వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వైఎస్ పావలా వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇచ్చారు. 


చంద్రబాబు హయాంలో  అది సరిగా అమలు కాలేదు,అందుకే మహిళలు బుద్ది చెఫ్హారు ...  


వాస్తవంగా 27,168.83 కోట్లు మహిళలకు చెల్లించాలి. రాష్ట్రంలో దాదాపు 9,33,180  సంఘాలు ఉన్నాయి. నాలుగు దఫాలుగా ఈ బకాయిలు చెల్లిస్తామని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 


 ఇది " వైయస్ ఆసరా " పథకం అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి కేవలం 1400 కోట్లు విడుదల చేయడం ఏంటి ? తామే మొట్టమొదటిసారి పథకాన్ని ప్రారంభిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అవివేకం....


గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకం ప్రారంభమైన సంగతి ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, బొత్స సత్యనారాయణకి తెలీదా ?


జగన్ 1400 కోట్లు విడుదల  చేసి మాకేమైనా బిక్షం వేస్తున్నారా  ? . ఇప్పుడు కొత్తగా వడ్డీ లేని రుణాలు అంటున్నారు.. మరి పాతవాటితో సంబంధం లేకుండానే కొత్తవి ఇస్తారా... లేక కొత్త రుణాలు ఇచ్చి పాత వాటి కింద జమ చేసుకుంటారా...! ఆరోజు చెప్పిన మాటకు... ఇప్పడు చేతలకు పొంతన లేదు. రాజధాని మార్పు, ఎన్నికలపై ఉన్న శ్రద్ధలో కనీసం 1శాతం పథకాల అమలుపై పెడితే బాగానే ఉంటుంది .రైతు ఏడ్చిన రాజ్యం, మహిళ కన్నీళ్లు పెట్టిన ప్రాంతం ఎప్పుడూ బాగు పడలేదు..ఒకరు ప్రారంభించిన పథకాలను తమ  పేరుతో ప్రచారం చేసుకోవడం బాగా అలవాటు అయ్యింది 
ఇప్పటి ప్రభుత్వాలకి .కనీసం అయ్య పేరుమీద ఉన్న పథకాలన్నా సక్రమంగా అమలు చేసే స్థితిలో జగన్ లేడు అని అర్థం అవుతోంది... ఇంక రాజన్న రాజ్యం తెస్తామని ప్రగల్భాలు పలకడం ఎందుకు.. ప్రజల్ని మోసం చేయడానికి తప్ప.ఎన్నికల సమయంలో బైబిల్ చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తూ జగనన్న రావాలి జగనన్నని ఆదరించండి అంటూ ప్రచారం చేసిన వైయస్ విజయమ్మ, షర్మిల రాష్ట్రంలో మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారు ? .హోంమంత్రి సూచరిత ముఖ్యమంత్రి జగన్ కు మౌత్ పీస్ లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  దిశ చట్టంమీద ఎన్ని కేసులు నమోదు చేశారు ప్రభుత్వం చెప్పాలి. నా పైనే వ్యక్తిగతంగా, అసభ్యకర పోస్టులు పెడుతుంటే దానిపై దిశ చట్టం మీద కేసు నమోదు చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరితే ఆయన ఇంకా ఇలా చట్టం అమలు కాలేదు ఏ విధంగా కేసు పెట్టాలని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఈరోజుకి కూడా మహిళలు కన్నీరు పెడుతున్నారు. కరోనా వైరస్ ను నియంత్రించడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తన  అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే ఈరోజు సున్నా వడ్డీ పథకాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంలో వైసీపీ ఎమ్మెల్యేల పాత్ర ఎక్కువగా ఉంది. ఎవరైతే జన సమూహంతో ర్యాలిలు , సభలు, సమావేశాలు నిర్వహించారో  ఆయా వైసీపీ నేతల మీద హత్యాయత్నం  కింద కేసు నమోదు చేయాలి. పేదలను , వలస కూలీలను ,అసంఘటిత కార్మికులను , రైతులను ఆదుకోవాలి ....ప్రభుత్వం మహిళలకు బకాయిలు వెంటనే చెల్లించాలి లేనిపక్షంలో రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను కలుపుకొని ప్రభుత్వంపై పోరాటం చేస్తాం .