హాట్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టి :కలెక్టర్ శేషగిరి బాబు

 



నెల్లూరు, 11-04-2020



నెల్లూరు:         జిల్లాలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్, ఎన్-95 మాస్కులు, శానిటేషన్ లిక్విడ్, వెంటిలేటర్లకు ఎలాంటి కొరత లేదని.., రీజినల్ కోవిడ్ సెంటర్ జి.జి.హెచ్ తో పాటు.. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కోవిడ్ -19 బాధితులకు చికిత్స అందించడానికి వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని కలెక్టర్     .శేషగిరి బాబు తెలిపారు. నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సి నందు మీడియాతో మాట్లాడిన కలెక్టర్.., కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వేగవంతంగా చికిత్స అందిచే ట్రూనాట్ మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటి ద్వారా ర్యాపిడ్ టెస్టులను 50 నిమిషాల్లో చేయవచ్చని.., దీనివల్ల కోవిడ్-19 పాజిటివ్ కేసులను త్వరగా గుర్తించి.., నివారణ చర్యలను వేగంగా తీసుకోవచ్చన్నారు. జిల్లాలో 718 మంది త్రోట్ నుంచి సేకరించిన నమూనాలను.., స్వాబ్ టెస్టుకు పంపించామని 618 ఫలితాలు వచ్చాయని.., 100 పరీక్షల ఫలితాలు రావాలన్నారు. హాట్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి.., త్రోట్ శాంపిల్స్ సేకరిస్తున్నామని.., జిల్లాలో మొత్తం 48 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.., వాటిలో ఒకరు డిశ్చార్జ్ అయ్యారని, మరొకరికి నెగిటివ్ వచ్చిందని.., దీంతో ప్రస్తుతం జిల్లాలో 46  పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. రీజినల్ కోవిడ్ సెంటర్ జి.జి.హెచ్ నందు 93 వెంటిలేటర్లు.., నారాయణ మెడికల్ ఆస్పత్రిలో 17 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జి.జి.హెచ్ నందు మరో 17 వెంటిలేటర్లు సాంకేతిక సమస్యల కారణంగా పనిచేయడం లేదని, వీటిని త్వరగా మరమ్మత్తు చేస్తామని, ఒకవేళ అవి పనిచేయకపోతే వాటి స్థానంలో కొత్తవి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన ఎన్.ఆర్.ఐలను హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నామని.., వారిలో ఎవరైనా 28 రోజులు దాటి హోం ఐసోలేషన్ లో ఉంటే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.., నెగిటివ్ రిజల్ట్ వస్తే హోం ఐసోలేషన్ వారికి అవసరం లేదని అధికారులకు తెలిపామన్నారు.  
కోవిడ్ -19 పాజిటివ్ లక్షణాలతో చెన్నైలో చికిత్స పొందుతున్న డాక్టర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు తెలిపారు.  నెల్లూరు జిల్లాలో కురిసిన అకాల వర్షాల ప్రభావంతో వరి, ఉద్యాన వన పంటలకు కొంతమేర నష్టం వాటిల్లిందని.., వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు జిల్లాలో పర్యటించి మండలాల వారీగా ఎంతపంట నష్టం కలిగిందనే నివేదికను ఇవ్వాలని ఆదేశించామన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని.., సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.