గ్రామ‌స్థాయిలో ఆక్వా ఉత్ప‌త్తుల విక్ర‌యాలు జ‌ర‌పాలి :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

గ్రామ‌స్థాయిలో ఆక్వా ఉత్ప‌త్తుల విక్ర‌యాలు జ‌ర‌పాలి
* కనీసం 20–25 ఉత్పత్తులు అందేలా చూడాలి 
* అప్పుడే రైతులు, ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది 
* ఏపీలో ‌జనతా బజార్ల నిర్వ‌హ‌ణ‌పై సీఎం జగన్‌ సమీక్ష 
అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జనతా బజార్ల విధివిధానాలపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. జనతా బజార్ల నిర్వహణ, విధివిధానాలపై సమీక్షలో అధికారుల ప్రతిపాదనలపై చర్చను శుక్ర‌వారం విడిది కార్యాల‌యంలో నిర్వ‌హించారు. జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం ఆదేశించారు. గ్రేడింగ్, ప్యాకింగ్‌ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలి. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు తగిన స్థాయిలో మార్కెట్‌ ఈ బజార్ల ద్వారా మార్కెటింగ్‌ అవకాశాలు లభించాలి. కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఇక్కడ విక్రయించేలా చూడాలి. దీనివల్ల రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీనివల్ల మార్కెట్‌లో పోటీ కూడా పెరుగుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే.. గ్రేడింగ్, ప్యాకింగ్‌ బాగుండాలి అని సూచించారు. కనీసం 20–25 ఉత్పత్తులు అందేలా చూడాలి. సమావేశంలో చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారుచేయాలని సీఎం ఆదేశం. మరింత మేథోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలని సీఎం కోరారు. కార్య‌క్ర‌మంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌  వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి, ప‌లువురు ఉన్న‌తాధికారులు హాజక‌య్యారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..