ఇది పాఠమా ? గుణపాఠమా ?

కల చెదిరిపోవచ్చు......
వర్షం రాకపోవచ్చు.......
సినిమా ఆడకపోవచ్చు.......
ఇవన్నీ మనం ఊహించవచ్చు......


కాని


ప్రపంచం ఆగిపోతుందని ఎవరైనా ఉహించారా ?


ఉహించనిది జరగడమే జీవితం అనుకుంటే .....
జరిగిన, జరుగుతున్న పరిస్థితిని
విపత్తు అనాలా, 
వినాశనం అనాలా లేక 
మహమ్మారి వికటాట్టహాసం అనాలా ?


తిన్నది అరక్క చేసే గొడవల వల్ల ఎదురయ్యే  కర్ఫ్వూ చూశాం... 


అమ్మవారు పోసిందనో, అనుకోని జబ్బు వచ్చిందనో, అయినవారు దూరం అయ్యారనో స్వీయ గృహ నిర్భందం చూశాం


కాని ఇవన్నీ కలకలిపి ఒకేసారీ అనుభవిస్తు, ఆచరించడం బహూశా జీవితంలో ఇదే మొదటిసారెమో !


మునుపెన్నడు లేనివిధంగా 
సంస్కృతి సాంప్రదాయలపై చర్చలు, 
శుచి శుభ్రతలపై అవగాహనలు
తినే తిండిపై నియంత్రణలు.......
అడుగుతీసి అడుగు వేయడానికి నిబంధనలు.... 


వెరసి కొత్త లోకంలో జీవిస్తున్న అనుభూతి...........


ఇది పాఠమా ? గుణపాఠమా ?


ఒక్కసారి మార్చి 22 నుండి చూసుకుంటే.......


పబ్బుల్లేవు, క్లబ్బులు లేవు
బార్లు లేవు, రెస్టారెంట్లులేవు


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!


ఫాస్ట్ ఫుడ్స్ లేవు, కేఫ్ లు లేవు 
పానీపూరీ,  మిర్చి, పిజ్జాలు లేవు


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!!!!


బళ్ళు లేవు, బంకులు లేవు
పెట్రోలు, డీజిలు చింతలేలేవు
బ్రాండెడ్ బట్టలు లేవు
బరి తెగింపులు అసలే లేవు


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!!


చీటికి మాటికి షాపింగులు లేవు
సినిమాలు లేవు, షికార్లు లేవు
బిర్యానీలు లేవు, పార్లర్లు లేవు 


అయినా జీవితం ఆగిపోలేదు..........


గుళ్ళులేవు, బడులు లేవు
చర్చిలు, మసీదులు లేవు
పూజలు లేవు నమాజులు లేవు
ప్రార్ధనలూ లేవు, 


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!


కాలుష్యం లేదు, కలహాలు లేవు
కల్లబొల్లి మాటలతో టైంపాసులు లేవు 
యాత్రలు లేవు, తీర్ధ యాత్రలు లేవు
టూరిజం అంటూ టూర్లు లేవు


అయినా జీవితం ఆగిపోలేదు!!!!!!!!


అయినదానికి, కానిదానికి అపాయింటుమెంట్లు తీసుకుని
వేలకి వేలు తగలేసె రోగాలు.... డాక్టర్లు చెప్పకుండానే మాయమయ్యాయి.....ఎలా ?


ఇరుగు, పొరుగు అంటూ బాంధవ్యాలు మొదలయ్యాయా... 


పనివాళ్ళు రాకపోయినా పనులేవి ఆగలేదు........ఎలా ?


మంచితనం. మానవత్వం మబ్బు పట్టిన ఆకాశంలా, ముంచెత్తె వరదలా వెల్లువెత్తాయి.......ఎలా?


డబ్బులున్నా ఏమి కొనలేరు
బయటకెళ్ళె ధైర్యం చేయలేరు
నిత్యావసరాలు తప్ప
నిర్జీవమైన వాటిని కొనలేరు.......



ధనవంతుడు, సామాన్యుడు అంతా ఒక్కటే అని ఎవరైనా చెబుతున్నట్టుందా ?


ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిందేమిటి.....


మనకి మనమే అంతర్మధనం చేసుకోవాల్సిన సమయమిది..... 


కుటుంబ వ్యవస్థ బలోపేతమైందా ?
అన్యోన్యత పెరిగిందా ?
బంధాలు బలపడ్డాయా ?
పిల్లలపై వాత్సల్యం పెరిగిందా ?
ఆరోగ్యంపై శ్రద్ద పెరిగిందా ?
ఆలోచనల్లో పదును పెరిగిందా ?
డబ్బుపై వ్యామోహం తగ్గి
ప్రాణమున్న వాటిపై ప్రేమ పెరిగిందా ?


పైవాటన్నింటికి కారణం ఏదైనా మనం మరచిన మంచి కాలాన్ని గుర్తుకు తెచ్చిందా... 


ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిందేమిటి అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయం బహూశా ఇదేనేమో ? 


ఆలోచించండి
అచరించండి
అనుభవించండి!


భవిష్యతరాలకు మంచి బాట వేయండి.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image