జర్నలిస్టులకు కూరగాయలు, పండ్లు, శానిటైజర్స్, మాస్కుల పంపిణీ


జర్నలిస్టులకు కూరగాయలు, పండ్లు, శానిటైజర్స్, మాస్కుల పంపిణీ


అమరావతి::   ఏప్రిల్,12 (అంతిమ తీర్పు) :          రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) నియంత్రణ చర్యలలో లాక్ డౌన్ సందర్భంగా అనేక ఇబ్బందులకు గురవుతూ సమాజ చైతన్యం కోసం తమ కర్తవ్యం నెరవేర్చుతున్న జర్నలిస్టులకు సాయం అందించాలనే దృక్పథంతో ఈ రోజు శానిటైజర్స్, మాస్కులు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేయడం జరిగిందని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ వి వి సాయి వరప్రసాద్ తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే అర్బన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మెగాసిటీ మైత్రి,  లయన్  చిగురుపాటి వరప్రసాద్ గారి సారధ్యంలోని లయన్స్ డిస్టిక్ట్ సర్వీస్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని కిట్ లను పంపిణీ చేశారు. సుమారు మూడు వందల మంది జర్నలిస్టులకు ఈ సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో జర్నలిస్టులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రధానంగా చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం ద్వారా కరోనా వ్యాధికి దూరంగా ఉండవచ్చని తెలిపారు.  ఈ కార్యక్రమంలో 
లయన్స్ క్లబ్ ఆఫ్ మెగాసిటీ  మైత్రి అధ్యక్ష, కార్యదర్శులు గంగుల వీరభద్రరావు, వి మురళీకృష్ణ, ఏ రాజా వెంకటరమణ, దుర్గా కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ కార్యదర్శి అడ్డూరి శ్రీనివాసరావు, లయన్స్ పీఆర్వో వై రంగారావు, జగదీష్ రావు, బ్లడ్ బ్యాంకు సభ్యులు మక్కిన వినోద్ కుమార్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, చిన్న పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, యూనియన్ సీనియర్ నాయకులు షేక్ బాబు, ఈవీ కోటిరెడ్డి, టి శివరామకృష్ణ,      పి సురేంద్ర కుమార్,చక్రవర్తి, డేవిడ్ రాజు, ఎంసీకే రాజు, మురళీకృష్ణ, వరమోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.