వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు కొనుగోలు, సరఫరా,


  విజయవాడ తేదీ: 03.04.2020


డాక్టర్లు, నర్సులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు కలసి వారి సంఘీభావాన్ని తెలపడాని ముందుకు వచ్చారు   ….. మంత్రుల బృందం


మంత్రులు బృందం, ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారం తో ఈ విపత్తు నుంచి బయట పడగలుగుతామని మంత్రుల బృందం ఛైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.


విజయవాడలో ని ఆర్ అండ్ బి రాష్ట్ర భవన సముదాయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మంత్రులు బృందం సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని,  మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జలరామకృష్ణారెడ్డి, బి. సాంబశివ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఎపిఎమ్ఐడీసీ ఛైర్మన్  చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు.


సమావేశంలో భాగంగా క్షేత్రస్థాయిలో కోవిడ్19 కు సంబంధించిన వివరాలు, క్వారెంటైన్ ఏర్పాట్లు, స్వీయ నియంత్రణ, హోమ్ క్వారెంటైన్, స్పెషల్ ఆఫీసర్ లు, నిత్యావసర సరుకుల పంపిణీ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు కొనుగోలు, సరఫరా, హమాలీలు, రైతు కూలీలు తదితర అంశాలపై చర్చించారు. కోవిడ్ 19 నిర్ధారణ వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు సంబంధించి విడి విడిగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.  ప్రముఖ వైద్యులను, సంస్థలను కోరడం జరిగిందన్నారు. ప్రవేటు హాస్పిటల్ ద్వారా టెలి మెడిసిన్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సమావేశంలో చర్చించారు.
 రాష్ట్రంలో కాకినాడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కడప, విశాఖపట్నం ప్రాంతంలో ల్యాబ్ లను అందుబాటులో ఉంచుకోవడం జరుగుతున్న దని అధికారులు తెలిపారు. కోవిడ్ నివారణకు అవసరమైన పరికరాలు సేకరణ కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విధుల్లో భాగస్వామ్యం అవుతున్న డాక్టర్లుకు అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకోవడం జరుగుతున్న ట్లు తెలిపారు. ఎన్95, సాధారణ మాస్క్ లు, పి పి ఎ లను సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సర్వే బృందాలను ఏర్పాటు చెయ్యడం తో పాటు ఆ బృందానికి అనుబంధం గా డాక్టర్లు ను అనుసంధానం చెయ్యడం జరుగుతుందని తెలిపారు.  ర్యాపిడ్ టెస్టింగ్ పరికరాలను అందుబాటులో కి తీసుకుని రావడం కోసం వాటి నాణ్యత, సామర్ధ్యం పరిశీలించి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులో కి తీసుకుని వొస్తామన్నారు. విఆర్డీ పరీక్షలు జరుపగలుగుతాము. అవసరమైన మందులను కూడా అందుబాటులో కి తీసుకుని రావడం జరుగుతుందన్నారు.  డాక్టర్, నర్సులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు కలసి వారి సంఘీభావాన్ని తెలపడాని ముందుకు వచ్చారనివారి సేవలను  వినియోగించు కుంటామన్నారు. మంత్రులు బృందం, ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారం తో ఈ విపత్తు నుంచి బయట పడగలుగుతామని మంత్రుల బృందం ఛైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.


ఈ 21 రోజుల లాక్ డౌన్ ఒక సువర్ణ అవకాశం, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం వొచ్చిందని, అనుమానాస్పద స్థితిలో ఉన్న వారి వివరాలు ఎప్పటికప్పుడు అధికారులకు104, 1092 నెంబర్ లకు , జిల్లాలో అందుబాటులో ఉన్న కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటికే ఎటువంటి అవాంతరాలు ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. క్వారెంటైన్ కేంద్రలలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు
అనంతరం నిత్యావసర సరుకుల పంపిణీ పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 1 కోటి 47 లక్షల కుటుంబాలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేయడం జరుగు తొందని, మొదటి 3 రోజులు ఎక్కువ మంది సరుకుల కోసం రావడం జరిగిందన్నారు. రద్దీని నివారించేందుకు ఇంటింటికి కుపన్ లు అందించి ఎప్పుడు సరుకులు తీసుకుని వెళ్ళాలో వాలంటీర్లు ద్వారా తెలియచెయ్యడం జరగాలని తెలిపారు.  మలి విడత లో పంపిణీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు సన్నాహాలు ఇప్పటినుంచే చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హత ఉన్న లభ్డిదారులకు బియ్యం అందించాలని, వెయ్యి రూపాయల ఆర్థిక చేయూత అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 15 నుంచి గ్రామ స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేయండం జరుగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో, క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి అక్కడే ధాన్యం నాణ్యత, మాయచ్చర్ ను తనిఖీ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తామన్నారు.