విలేకరులకు కరోనా టెస్టులు నిర్వహించాలి: APJF నేత యేమినేని వెంకట రమణ  (ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ) 

విలేకరులకు కరోనా టెస్టులు నిర్వహించాలి
  
జిల్లా కలెక్టర్,పోలీసు కమిషనర్, వి ఎం సి కమిషనర్, లు చొరవ చూపాలి..........


 యేమినేని వెంకట రమణ  ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం  విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి వినతి
విజయవాడ....ఏప్రిల్ 22  ( అంతిమ తీర్పు);         విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి అంచెలంచెలుగా విజృంభిస్తున్న  తరుణంలో విధి నిర్వహణలో ఉన్న విలేకరులకు కరోనా టెస్టులను నిర్వహించాలి 


 విలేకరులందరూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.   ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని  నిత్యం వార్తల సేకరణలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తమ విధులను నిర్వహిస్తూ ప్రజాప్రతినిధుల కార్యక్రమాలను సేకరిస్తూఉంటారు 


.కరోనా మహమ్మారి కారణంగా ఒక్క పక్క తమను తాము కాపాడుకుంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ వార్తల సేకరణలో నిమగ్నమయ్ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 


 అందుకు ఉదాహరణ ముంబాయి లో 6గురు విలేకరులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అవడమే 


.ఈ విషయమై అప్పటికప్పుడు ప్రభుత్వం కదిలి విలేకరులకే కాకుండా ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలకు కరోనా పాజిటివ్ టెస్టులు నిర్వగించాలి   కరోనా వలన ముంబాయ్ నగరం గందరగోళంగా మారింది. 
ముంబాయి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాకుండా ముఖ్యంగా కార్యక్రమాలు ఎక్కువుగా జరిగే పట్టణ ప్రాంతాలలో ప్రజాప్రతినిధుల కార్యక్రమాలలో పాల్గొటుంన్న విలేకరులకు ముందస్తు కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఎటువంటి సమస్యలు ఉండవని విలేకరులు భావిస్తున్నారు.


ఒక విలేకరికి కరోనా పాజిటివ్ వచ్చినా మిగిలిన విలేకరులకు రాదని నమ్మకం లేదు విధి నిర్వహణలో వార్తలను,ఫొటోలను,వీడియోలను ఒకరి నుంచి ఒకరు పంచుకుంటారు.అంతేకాక ప్రజాప్రతినిధులతో,ప్రజలతో మమైకంగా ఉంటారు. 


ఎటువంటి అత్యవసర పరిస్థితి అయినా అధికారులతో పాటు వార్తల సేకరణ కోసం పరుగులు తీస్తుంటారు.ఇలాంటి నేపధ్యంలో ప్రజాప్రతినిధులు స్పందించి విలేకరులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే విలేకరుల కుటుంబాలకే కాకుండా సమాజానికి మేలుచేసిన వారవుతారు.
వార్తలు సేకరణలో భాగంగా విలేకరులు ముందు వెనకా ఆలోచించకుండా  బ్రేకింగ్ న్యూస్ కోసం పరుగులు తీస్తున్నారు ...


పోలీసులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు  సిబ్బంది, కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను గ్యాప్ లేకుండా నిరంతరం ప్రజల్లోకి వార్తలు చేరవేస్తున్న విలేకరులు ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు 


విలేకరుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో,  నగరంలోని  ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,  విలేకరుకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాను  


ఈ విషయంలో మంత్రులు ,ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొంటే రాష్ట్రంలో వేలాదిమంది విలేకరుల కుటుంబాలను ఆదుకొన్నవారవుతారు ...యేమినేని వెంకట రమణ  ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం  విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి .....


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image