*ఎట్టకేలకు మంచి నీటి పథకానికి మోక్షం*
(*అంతిమ తీర్పు కథనానికి స్పందన*)
ఉదయగిరి నియోజకవర్గ పరిధి లోని వరికుంటపాడు మండల గువ్వడి లో గల రక్షిత మంచి నీటి పధకానికి మోక్షం లభించింది. 'తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు' అనే శీర్షిక న గతవారం (అంతిమ తీర్పు పత్రిక లో) ప్రచురితం అయింది. ఇందుకు స్పందించిన అధికారులు మంచి నీటి పధకం లోని రెండో మోటార్ ను గురువారం పునరుద్ధరించారు. ఫీల్డ్ అసిస్టెంట్ శేషం రమేష్, శేషం అశోక్, భూతపల్లి రాజు సైతం బోరు రిపేర్ లో బాధ్యత వహించారు, తాగు నీటి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీడీఓ సురేష్ బాబు, పంచాయతీ సెక్రటరీ లు శివకుమార్, దస్తగిరి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు
ఎట్టకేలకు మంచి నీటి పథకానికి మోక్షం*