గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకోండి ;మందలపు

గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకోండి ;మందలపు
వరికుంటపాడు ,:.       ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం వాళ్ళని ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధర కల్పించింది అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరికుంటపాడు మండల వైసీపీ కన్వీనర్ మందలపు తిరుపతినాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తో వరికుంటపాడు, దుత్తలూరు మండలాల రైతులను ఆదుకునేందుకు దుత్తలూరు లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసారని అక్కడ ప్రభుత్వం కేటాయించిన మద్దత్తు ధర తో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని వివరించారు. దళారుల బెడద లేకుండా నేరుగా అమ్మకాలు చేసుకునేందుకు ఎంతో అనుకూలము గా ఉంటుందని తెలిపారు. వరికుంటపాడు మండలం లోని విరువూరు, మహ్మదాపురం, వరికుంటపాడు పంచాయతీ ల పరిది లో శెనగలు అమ్ముడు అయ్యాయి అని అదే కొనుగోలు కేంద్రం లో జొన్నలు, మొక్కజొన్నలు, పెసలు ప్రభుత్వ మద్దతు ధరకే కొనుగోలు చేస్తారని రైతులు ఈ అవకాశాన్ని పొందాలన్నారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలీ అహ్మద్, వరికుంటపాడు సింగిల్ విండో అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు రైతుల మేలుకోసం అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ చేసుకోవాలని మందలపు తిరుపతి నాయుడు తెలిపారు.