దాతృత్వం అభినందనీయం - సామాజిక దూరం పాటించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది  -   DGP గౌతమ్  సవాంగ్

 తేది : 12.04.2020


 *దాతృత్వం అభినందనీయం - సామాజిక దూరం పాటించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది  -  AP DGP గౌతమ్  సవాంగ్ IPS.* 


లాక్‌డౌన్ వేళ అన్ని వర్గాల ప్రజలకు  అండగా ఉండాలనే సదుద్దేశంతో  పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక  నిరతి కలిగిన వ్యక్తులు, దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఫుడ్ ప్యాకెట్లు ఇలా తమకు తోచిన రీతిలో పంపిణీ కార్యక్రమాలు చేయడం అభినందనీయం. వారి దాతృత్వానికి పోలీసు శాఖ శిరస్సు వంచి నమస్కరిస్తోంది.  అయితే అట్టి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో  సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  జనాలు ఒకే చోట గుమికూడ‌టంతో క‌రోనా వైర‌స్ విసృతంగా వ్యాపించే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనమందరం దేనికోసం శ్రమిస్తున్నామో ఆ లాక్ డౌన్ స్ఫూర్తి  దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి.   ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వమే మరింత పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి మున్సిపాలిటీ/ కార్పొరేషన్ పరిధిలో వస్తు పంపిణీ చేయదలచిన దాతల దగ్గర నుండి వస్తువులు సేకరించి అట్టి వాటిని సామాజిక దూరం పాటిస్తూ పేదలకు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున దాతలు మున్సిపల్ కమీషనర్లను సంప్రదించి అట్టి కార్యక్రమాలు చేబట్టగలరని  మనవి.


 ,
ధ్ర్