వింజమూరులో దాతల సహకారం ప్రశంసనీయం :ఎస్.ఐ బాజిరెడ్డి


వింజమూరు, ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో దాతలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎస్.ఐ బాజిరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో వి.యస్.ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వనిపెంట.సుబ్బారెడ్డి ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజనాలు అందించే కార్యక్రమానికి ఎస్.ఐ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనిపెంట.సుబ్బారెడ్డి ఇప్పటికే వింజమూరులోని పలు ప్రాంతాలలో పేద ప్రజలకు విరివిగా కూరగాయలను పంపిణీ చేస్తూ తన దాతృత్వమును చాటుకుంటుండటం గొప్ప విషయమన్నారు. తాజాగా ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణ దిశగా పని చేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి వారి వారి కార్యాలయాలకే భోజనాలు చేర్చి అన్నదాతగా కీర్తి గడించారన్నారు. మండల వ్యాప్తంగా దాతలు చేస్తున్న సేవలు మరువరానివన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, రెవిన్యూ తదితర శాఖలతో పాటు జర్నలిస్టులకు సైతం సుబ్బారెడ్డి భోజన ప్యాకెట్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి, ప్రభుత్వ వైధ్యాధికారి హరిక్రిష్ణ, బి.జె.పి నియోజకవర్గ ఇంచార్జ్ యల్లాల.రఘురామిరెడ్డి, పి.సి.సి సభ్యులు మద్దూరు.రాజగోపాల్ రెడ్డి, వై.సి.పి నేతలు గణపం.రమేష్ రెడ్డి, కైపు.సుబ్బారెడ్డి, నీలం.సంజీవరెడ్డి, ముస్లిం హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ప్రతినిధులు ఎస్.కె.రఫి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image